• masa
  • masa
Karkaataka Raasi

ఆదాయం : 5; వ్యయం : 5; రాజపూజ్యం : 5; అవమానం : 2

ఈ రాశివారికి అదృష్టసంఖ్య ‘2’. 4, 6, 8, 9 సంఖ్యలతో కూడిన తేదీలు ఆది, సోమ, శనివారాలతో కలిసివస్తే యోగప్రదం. ఆంజనేయ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రతి మంగళవారం అభిషేకం, సూర్యారాధన చేస్తే మంచిది. స్త్రీలు దుర్గ, సుబ్రహ్మణ్య స్తోత్రాలు చేస్తే ఆరోగ్య, సంతాన ప్రాప్తి కలుగుతుంది.

ఈ రాశివారికి ఈ ఏడాది గురుని జన్మస్థాన సంచారదోషం తొలగి, ద్వితీయస్థాన సంచార యోగం కలుగుతుంది. కాబట్టి.. బంధుమిత్రల్లో, సంఘంలో కీర్తి పెరుగుతుంది. విద్యారంగంలో వున్నవారు నిరంతర కృషిచేస్తే ఉన్నత శిఖరాలను అవరోధిస్తారు. సంవత్సర ఆరంభంలో మోస్తరు ఫలితాలు వున్నప్పటికీ కాలం గడిచేకొద్దీ వృద్ధి కలుగుతుంది.

నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, కుటుంబ వాతావరణంలో కొన్ని అసంతృప్తులు, అసమానతలు, మాటపట్టింపు ధోరణులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో అవసరమైన సమయాల్లో ధనం పొంది, ఆర్థిక రంగంలో ప్రభావం చూపుతుంది. శారీరకంగా అసౌఖ్యం తప్పదు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చి, ఇబ్బందులు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతన పరిశోధనలు ప్రారంభించుటకు ఇది అనువైన సమయం. దీర్ఘకాలిక రోగపీడితులు సంవత్సరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

కర్కాటక రాశివారు వ్యవసాయదారులకు, పర్యాటక రంగంలో వున్నవారికి పెను సవాళ్లు ఎదురవుతాయి. విద్యా, వైజ్ఞానిక రంగంలో వున్నవారికి, సినీ పరిశ్రమలో వున్నవారికి అధిక శ్రమ వుంటుంది. దాని ఫలితంగా మంచి గుర్తింపు పొంది, ఆర్థికంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు నిరంతరం శ్రమ చేయడంవల్ల దాని ఫలితం దక్కదు. పైగా పై అధికారులనుండి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ వాటిని ఎదురించి తమ జీవితాన్నిముందుకు కొనసాగిస్తారు.

ఉద్యోగులకు నిరంతరం శ్రమ చేయడంవల్ల దాని ఫలితం దక్కదు. పైగా పై అధికారులనుండి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ వాటిని ఎదురించి తమ జీవితాన్నిముందుకు కొనసాగిస్తారు. ధనాదాయంలో ఎక్కువ వృద్ధి వుండక.. ఆరోగ్య సమస్యలకు అధిగమించడానికి, ఇతర కార్యాలకు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ రాశివారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతంది. కుటుంబసభ్యులందరూ ఆరోగ్యంగా వుంటారు. పుణ్యకార్యాలలో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపుతారు. దూరప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వలసలకు వెళతారు.

కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది. కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడసూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం. ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటివాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు. ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీషు మందులకన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించటం ఎంతైనా మంచిది.

valuprma