• masa
  • masa
Makara Raasi

ఆదాయం - 5; వ్యయం - 2; రాజపూజ్యం - 2; అవమానం - 4

మార్చి : ధనలాభం, ఆరోగ్యం, స్త్రీలాభం వంటివి ఫలితాలు కలుగుతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవం, ప్రత్యేక స్థానం లభిస్తుంది. ద్రవ్యప్రాప్తి అధికంగా వుంటుంది. ఈ మాసంలో శుభవార్తలు వింటారు.

ఏప్రిల్ : బంధుమిత్రుల కలయిక, శుభకార్యాల్లో మిత్రగోష్ఠి, సరదా కాలక్షేపములు. మధురపదార్థం లాభం. భార్య సోదరవర్గం అనుకూలంగా వుంటుంది.

మే : వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా వుండాలి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శతృబాధ, రుణాలకోసం ప్రాకులాడుతారు.
జూన్ : జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వుంటాయి. మాసాంతంలో ధనధాన్య వస్త్ర లాభాలు, కీర్తి, మానసిక ఉల్లాసాలు వుంటాయి.

జూలై : కుటుంబ వాతావరణంలో ఉల్లాసం వుంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు మెలుగుతాయి. శుభకార్యాలు చేస్తారు. ధనధాన్య, వస్త్రలాభాలు చేకూరుతాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆకస్మిక తనిఖీలు.

ఆగస్టు : ప్రభుత్వ, కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు. అందివచ్చిన అవకాశం దురదృష్టవశాత్తూ చేజారుతుంది. నేత్ర సంబంధమైన అనారోగ్య సూచికలున్నాయి. విద్యార్థులకు మాసాంతంలో ప్రశంసా పారితోషికాలు అందుతాయి.

సెప్టెంబర్ : ప్రతిపనియందు ఆటంకాలు ఎదురయి చికాకును కలిగిస్తాయి. మనస్తాపం అయినవారిచే మాటపడుట వుంటుంది. దూరప్రయాణాలు నిరర్దకములు అవుతాయి. ఉన్నతాధికారులకు స్థానచలన సూచనలున్నాయి. మాసం చివరలో గురుభక్తి, ఆరోగ్యం, నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.

అక్టోబర్ : బద్ధకంతో ఏ కార్యం సక్రమంగా నిర్వర్తించరు. రుణాలకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో అకస్మాత్తు కలహాలు కలుగుతాయి. రాజకీయ ప్రముఖుల అవసరం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలున్నాయి.

నవంబర్ : అనవసర ప్రయాణాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యం. వృత్తి ఉద్యోగముల యందు కష్టం, ఒత్తిళ్లు ఎక్కువగా వుండటం వల్ల ప్రశాంతత వుండదు. శత్రువుల నుంచి హెచ్చరిక వాక్యాములు వుంటాయి.

డిసెంబర్ : మనో విచారం, భోజన అసౌఖ్యంగా వుంటాయి. చుట్టూ ఎంతోమంది వున్నప్పటికీ మనసులో మాత్రం ఒంటరితనం అనిపిస్తుంది. ఆరోగ్యం నిలకడగా లేక వైద్య సలహాలు తీసుకుంటారు. చిన్న వ్యాపారులు అధిక శ్రమంతో అంతంతమాత్రమే లాభాలు పొందుతారు.

జనవరి : తప్పుదోవ పట్టించే మాటలు విద్యార్థులపై ప్రభావితం చూపుతాయి. ప్రముఖ వ్యాపార స్థలములయందు చోరబాధలు జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. చిరకాలంగా ప్రయత్నిస్తున్న పనులు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

ఫిబ్రవరి : మనసులో తలచిన కార్యాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ద్రవ్యలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. పాత స్నేహితులు తారపడతారు.

మార్చి : వ్యాపార విస్తరణకై చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కలిసివచ్చే పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. అధికారులు, తమ క్రింది ఉద్యోగులను వాక్చాతుర్యంతో గాడిన పెడతారు.

valuprma