• masa
  • masa
Kumbha Raasi

ఆదాయం : 5; రాజపూజ్యం : 6; వ్యయం : 5; అవమానం : 3

మంగళ, బుధ వారాల్లో అన్ని విషయాలలో ఓర్పు, జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. తలపెట్టిన కార్యక్రమాలను ఆటంకాలు ఎదురయినప్పటికీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలు అభివృద్ధికి తోడుగా వుంటాయి. అవసరాలను తీర్చుకోవడం కోసం అధికంగా ఖర్చులను వెచ్చిస్తారు.

ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొత్త ప్రణాళికలను ప్రవేశపెట్టుకుంటారు. కళ, క్రీడ, సాహిత్య రంగాల్లో వున్నవారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు బంధువులు, ఇతరుల నుంచి వస్త్రప్రాప్తి, వస్తులాభం వంటి శుభపరిణామాలు జరుగుతాయి. స్త్రీలు ఇతరుల విషయంలో అనవసరంగా నోరు పారేసుకోకుండా అదుపులో వుంచుకుంటే మంచిది. వ్యాపార అభివృద్ధిలో మార్పులు సంభవిస్తాయి. మార్కెట్ రంగంలో వున్న కలెక్షన్ ఏజెంట్లకు ఒత్తిడి అధికంగా వుంటుంది. శ్రీమతి, సంతానం మొండితనంవల్ల నిరాశకు గురవుతారు.

valuprma