• masa
  • masa
Kanya Raasi

ఆదాయం : 11; వ్యయం : 8; రాజపూజ్యం : 5; అవమానం : 4

ఆదాయ వ్యయాలు ఆలోచనలకు భిన్నంగా, వ్యతిరేకంగా వుండటంతో ఆర్థికపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆది, గురు, శనివారాల్లో ఖర్చులను అధికంగా వెచ్చించి పడేస్తారు. శ్రీమతి మీమీద అనుమానాలతో లేనిపోని ప్రశ్నలు వేయడంతో మానసికంగా నిరుత్సాహానికి గురవుతారు.

లక్ష్యాలను ఛేదించడానికి ఓర్పు, ఏకాగ్రత, పునరాలోచన చాలా ముఖ్యం. సొంతంగా నిర్వహించుకున్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి శ్రమించాల్సి వుంటుంది. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఆస్తి తగాదాలు, భూ విక్రయాలు, కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ తీర్పులను వెలువరిస్తాయి. చేతివృత్తులు, వ్యవసాయరంగంలో వున్నవారికి శ్రమ తప్ప లాభాలు వుండవు. ఆత్మీయులు ఉల్లాస జీవనాన్ని కొనసాగిస్తారు. నిరుద్యోగులు శ్రమించాల్సి వుంటుంది. దంపతుల మధ్య తగాదాలు, గొడవలు తీవ్ర స్థాయికి చేరిపోతాయి.

valuprma