• masa
  • masa
Midhuna Raasi

ఆదాయం : 11 ; రాజ్యపూజ్యం : 3 ; వ్యయం : 8 ; అవమానం : 1

ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా వుండటం వల్ల ఆర్థికపరంగా ఎటువంటి సమస్యలు వుండవు. శనివారంరోజు మీరు నిర్వహించుకునే పనులు, కార్యక్రమాలు, కార్యాలలో స్వల్పంగా అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు చాలా వున్నాయి. స్థిరాస్తుల విషయాలలో మంచి ఆదాయమే చేతికి అందుతుంది.

శ్రీమతి, సంతానం అవసరాలు, కోరికలను తీర్చడం కోసం ఎక్కువ ఖర్చులు చేస్తారు. స్త్రీలకు బంధువులు, సన్నిహితుల నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అందుతాయి. ఉమ్మడిగా వ్యాపారాలను, ఒప్పందాలను, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా కొనసాగిస్తారు. కంట్రాక్టర్లకు, బిల్డర్లకు తమ దగ్గర పనిచేస్తున్నవారి నుంచి చికాకులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. ప్రయాణాలలో వెళ్లినప్పుడు అసౌకర్యానికి గురవుతారు. వాహనం నడిపేవారు జాగ్రత్త.

valuprma