• masa
  • masa
Kanya Raasi

ఆదాయం - 11; వ్యయం - 5; రాజపూజ్యం - 4; అవమానం - 5

మార్చి : కోపతాపాలు అదుపులో వుంచుకుని ఇతరులతో స్నేహపూర్వకంగా మెలిగితే మంచిది. నూతన వస్త్ర, వస్తు లాభాలు కలుగుతాయి. మనసున ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి వుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

ఏప్రిల్ : గురువులు, పెద్లయెడల మర్యాదగా వుండి వారితో మన్ననలు పొందుతారు. వస్త్రలాభం, ఆరోగ్యం, ఇష్టార్థ లాభాలు కలుగుతాయి.

మే : విలువైన వస్తువులు అజాగ్రత్త వల్ల మనుమరుగవుతాయి. మనస్సున మనోవ్యాకులం, కళత్రంతో మాట పట్టింపులు, తమకంటే తక్కువవారిని చూసి భయపడటం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

జూన్ : సౌందర్యాభిలాషణ, తెల్లని వస్తువులు ధరించుట, పరిమళ ద్రవ్యములపై మక్కువ కలిగి వుంటారు. చేతివృత్తివారికి, చిన్నవ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగరీత్యా అధిక ప్రయాణాలు చేయాల్సి వుంటుంది.

జూలై : చేయని పనికి వివరణ ఇచ్చుకోవాల్సి వుంటుంది. సోమరితనం వల్ల ముఖ్యకార్యం చేదాటిపోతుంది. అనవసర వ్యవహారల యందు ఆసక్తి కలిగి వుండటంతో కొన్ని వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది.

ఆగస్టు : కొన్ని సందర్భాల్లో లేకితనం, మనో విచారం, భోజన అసౌఖ్యం వంటివి వుంటాయి. శరీరం, అసౌఖ్యానికి గురవుతుంటారు. మాసాంతంలో ఆలోచనలకు తగిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

సెప్టెంబర్ : మాసారంభంలో భూక్రయవిక్రయములందు లాభం, సంతోషం, పలు సందర్భాల్లో ధైర్యంగా ముందడుగు వేసి విజయవంతంగా సాగుతారు. నూతన విషయాలను నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగి వుంటారు.

అక్టోబర్ : కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరగా వుంటుంది. సోదరసోదరీమణులతో సత్కాలక్షేమాలు, సంతాన వృద్ధి కలుగుతాయి. వ్యాపారజనులు భాగస్వాములతో అన్యోన్యతలు కలిగి వుండి వ్యాపారంలో లాభాలబాట పడతారు.

నవంబర్ : ఎక్కడో ఏదో జరిగిపోతోందని భయం కలిగి వుంటారు. చిత్రభ్రమ, దుస్వప్నములు ఆందోళన కలిగిస్తాయి. చిలిపి ఆలోచనలు, యత్నకార్య సిద్ధి, అలంకార వస్తు ప్రాప్తి కలుగుతాయి.

డిసెంబర్ : సహాయం కోరి వచ్చినవారికి పరోపకారం చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సంపద, ఆరోగ్యం, పుత్ర, కళత్ర, సౌఖ్యములు కలుగుతాయి.

జనవరి : ప్రతి పనీ కష్టంగా భావించడం వల్ల అనవసర చికాకులు, వివాదాలు కొని తెచ్చుకుంటారు. శతృత్వాలు పెరుగుతాయి. తద్వాత అపకీర్తి మిగులుతుంది. అధిక ప్రయాణాలు అలసట కలిగిస్తాయి.

ఫిబ్రవరి : మాసమంతా శుభ, అశుభ ఫలితాలు మిశ్రమ సమాహారంగా వుంటుంది. శత్రుమిత్రుత్వాలు, మిత్రశత్రుత్వాలు రెండూ వుంటాయి. కొన్ని స్వార్థశక్తులు మిత్రుల్లాగా అభినయం చూపుతారు. కాబట్టి జాగ్రత్తగా వుండండి.

మార్చి : మాసారంభం ధన, ధాన్య, వస్త్ర లాభం, మనోధైర్యం వుంటాయి. ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో ప్రతికూలతలు వున్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. సుఖం, ధనాగమనం, కార్యజయం బలం.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma