• masa
 • masa
Karkaataka Raasi

ఆదాయం : 5 వ్యయం : 5 రాజపూజ్యం : 5 అవమానం : 2

మార్చి : వృత్తి వ్యవహారాలయందు అధిక శ్రమతో పనులు పూర్తికాగలవు. వ్యాపార జనులకు ఒడిదుడుకులు. మనోవ్యాకులం. తీర్థయాత్ర సందర్శనలు సఫలమవుతాయి.

ఏప్రిల్ : అకస్మాత్తుగా వచ్చే కలహాలతో తీవ్ర మానసిక ఆవేదానికి గురవుతారు. విద్యార్థులు నిరంతర కృషిచేస్తేనే విజయం వరిస్తుంది. మాసాంతంలో బంధుమిత్రులతో నిరంతర సంభాషణలు, విందు వినోదాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మే : ముఖ్య సమయాల్లో ధైర్యం ప్రదర్శించి, సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. పలువురిని ఆకర్షించే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మిత్రశతృత్వాలు, శతృమిత్రుత్వాలు రెండూ వుంటాయి.

జూన్ : పూర్వ ప్రయత్నాలు ఫలించి కొన్ని వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ప్రాణమిత్రుల నుంచి విలువైన సమాచారం లభిస్తుంది. దూర ప్రయాణాలు అవసరమైన ప్రాధాన్యాన్ని బట్టి చేయడం మేలు.

జూలై : సోదరమూలక ధనవ్యయం. విద్యా, వ్యాపారంగాల వారికి పై అధికారులతో కత్తిమీద సాము అన్నట్లుగా వుంటుంది. ప్రతి వ్యవహారంలో ఆలోచించి ముందుకు సాగితే మంచిది. పునరాలోచన చేసుకోవడం శ్రేయస్కరం.

ఆగస్టు : ఆర్థిక, వ్యాపారరంగ ప్రముఖులతో సమావేశాలు జరుపుతారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మాసాంతంలో శారీర అలసత్వం, ఉష్ణసంబంధ అనారోగ్యం సూచితమములు. దుస్వప్ననములు కలవరపెడతాయి.

సెప్టెంబర్ : మనోవ్యాకులం, అధిక ధనవ్యయం వుంటాయి. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే వుంటూ సహనాన్ని పరీక్షిస్తుంది. మనసులో భయాందోళనలు వుంటాయి. బంధువులు, మిత్రులు కష్టసమయాల్లో సహాయసహకారాలు అందజేస్తారు.

అక్టోబర్ : రంగస్థల, సినీరంగం వారికి శుభసమయం. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్త్రీ మూలక సౌఖ్యం. నూతన పరియాలు వుంటాయి. ధనలాభం, యశోవృద్ధి, ధర్మకార్యాచరణ. వ్యవహారాల్లో జయం, అనుకూలత వుంటుంది.

నవంబర్ : సోదరమూలక సౌఖ్యం కలుగుతుంది. స్థిరాస్తుల విషయంలో అనుకూల వాతావరణంలో విభజన ప్రక్రియ జరుగుతుంది. భూసంపాదనకై చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు జాగ్రత్తగా వుండాలి.

డిసెంబర్ : వ్యాపార వ్యవహారాల్లో ఓ మోస్తరు ఒడిదుడుకులు వున్నా.. లెక్క చేయకుండా ముందడుగు వేస్తారు. ధైర్యం, మొండితనం వల్ల కొన్ని కష్టకార్యాలు సులభతరం అవుతాయి. చర, స్తిరాస్తుల క్రయవిక్రయాదులకు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి.

జనవరి : కుటుంబ వ్యక్తులతో, వ్యాపార భాగస్వాములతో మాటతొందర వల్ల విరోధాలు పెరుగుతాయి. ఇతరుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడుతారు. నిరుత్సాహం, నిరాశలతో కాలక్షేపం చేస్తారు.

ఫిబ్రవరి : కోర్టు వ్యవహారాల్లో, ఉద్యోగులకు పై అధికారులతో వున్న వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయవలెను. గతంలో వ్యవహరించిన కారణంగా కొత్త సమస్యలు దరిచేరవు. వృధామాటలు, అధికకాలం వృధా చేస్తారు.

మార్చి : కోర్టు లావాదేవీల్లో కొన్ని సమస్యలుంటాయి. కీర్తి, ధర్మసిద్ధి కలుగుతాయి. ఉద్యోగులకు అధికారులతో సదవగాహనలు వుంటాయి. కొన్ని దీర్ఘకాలిక బాధ్యతలు ఈ మాసంలో నెరవేరే సూచనలున్నాయి.

rashi
 • Mesha Raasi
 • Vrushaba Raasi
 • Midhuna Raasi
 • Karkaataka Raasi
 • Simha Raasi
 • Kanya Raasi
 • Tula Raasi
 • Vruschika Raasi
 • Dhanus Raasi
 • Makara Raasi
 • Kumbha Raasi
 • Meena Raasi
 

valuprma