Malayalam actress gopikapng

malayalam-actress-gopika, gopika interview, gopika husband, malayalam-actress-gopika.

malayalam-actress-gopika, gopika interview, gopika husband, malayalam-actress-gopika.

Malayalam Actress Gopika.png

Posted: 10/10/2012 01:52 PM IST
Malayalam actress gopikapng

Gopijkaఈ అమ్మాయి ముద్దబంతి పువ్వు. ఆనందం ఆరబోసినట్టుంటుందామె  నవ్వు. కథానాయిక అందంగా ఉండడం సినీలోకంలో కొత్త కాకపోయినా ఆనందమే అందం అని నిరూపించేలా కనిపించడం కాస్త విశేషమే. అందుకే... ఆమెను చూసి దక్షిణాది ప్రేక్షకులు ముద్దుగుమ్మవంటూ ముచ్చటపడ్డారు. ఆకట్టుకున్నావంటూ ఆదరించారు. స్వల్పకాలంలోనే అందరికీ తమ ఇంటి అమ్మాయిలా అనిపించిన ఆ పక్కింటమ్మాయి ఇప్పుడు వెండితెర పై ‘కనబడుటలేదు’. ‘మల్లీశ్వరివే మధురాశల మంజరివే’ అంటూ కుర్రాళ్ల మనస్సులను దోచిన గోపిక ఎక్కడుంటుంది ? ఏం చేస్తుంది ? ఆమె గురించి నాలుగు మాటలు...

కేరళ కొబ్బరికే కాదు... సంప్రదాయపు సిరులొలికించే అందమైన అమ్మాయిలకూ కేరాఫేమో అనిపిస్తుంది గోపికను చూస్తే. కేరళలోని త్రిస్సూర్‌లో ఉన్న వల్లూర్... గిర్లీ ఆంటో (గోపిక అసలు పేరు) జన్మస్థలం. ఆంటో ఫ్రాన్సిస్, టెస్సీ ఆంటోల ఇద్దరు కూతుర్లలో ఒకరీమె. సెయింట్ రాఫెల్ స్కూల్లో 12వ తరగతి చదివి, కాలికట్ యూనివర్సిటీలో సోషియాలజీ పూర్తి చేసుకుంది. సరదాగా పార్టిసిపేట్ చేసిన తొలి బ్యూటీ పెజెంట్‌లోనే మిస్ కాలేజ్‌గా సెలెక్టయింది. ఆ స్ఫూర్తితో మిస్ త్రిస్సూర్ టైటిల్‌కూ గురిపెట్టింది. ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి, టైటిల్ విజేత కన్నా మిన్నగా బోలెడు మోడలింగ్ అసైన్‌మెంట్లలోకి... అలా అలా సినిమాల్లోకి వచ్చేసింది. ‘‘సినిమా ఎప్పుడూ నా కెరీర్ ప్లానింగ్‌లో లేదు. ఎయిర్‌హోస్టెస్ కావాలనుకున్నాను. అనుకోకుండా సినీ నటిని అయిపోయాను ’’ అంటుంది గోపిక.

సౌతిండియా... వలచిందయా !

మలయాళ సినిమా ‘ప్రణయ మానితూవల్’ ద్వారా గోపిక సినీరంగానికి పరిచయమైంది. అందులో ఆమెను చూసి యువకులు మధురమైన ఊహల్లో తేలిపోయారు. రెండో సినిమా ‘4 ది పీపుల్’ (యువసేన) ఆమెను సక్సెస్‌ఫుల్ తారగా మార్చేసింది. అందులోని ‘లజ్జావతియే (మల్లీశ్వరివే)’ పాట ఆమెకు యువ అభిమానుల్ని అమాంతం పెంచేసింది. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటిగా దూసుకొచ్చిన అవకాశాలతో మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో బిజీ నటిగా మారింది. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ కొట్టింది. తెలుగులో రవితేజకు ‘స్వీట్ మెమొరీస్’ అందించాక, లేత మనసులు, వీడు మామూలోడు కాదు, వీధి తదితర చిత్రాల్లో నటించింది. మూడు ఆసియా నెట్ అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకుంది. దాదాపు 30 సినిమాల్లో మెరిసి, ఐదేళ్లలోనే ఇన్ని సాధించి, ఒక్కసారిగా ఎందుకు తెరమరుగైంది?

వివాహంతో వెండితెరకు గుడ్‌బై...

gopika-familyతక్కువ కాలమే సినిమారంగంలో ఉన్నా చాలావరకూ మంచి సినిమాల్లోనే నటించింది గోపిక. అవార్డ్స్‌తో, బాక్సాఫీస్ హిట్స్‌తో కెరీర్ విజయవంతంగా సాగిపోతున్న దశలోనే అజిలేష్ చాకొ అనే నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన వైద్యుడిని పెళ్లాడింది గోపిక. అప్పుడే సినీ రంగం నుంచి దూరంగా వెళ్లింది. ఆ దూరాన్ని కంటిన్యూ చేస్తూ దాదాపు నాలుగేళ్లుగా ఐర్లాండ్‌లోనే నివసిస్తోంది. మంచి స్క్రిప్ట్, పాత్ర లభిస్తే పెళ్లయిన తర్వాత కూడా నటిస్తానని ప్రకటించినప్పటికీ వివాహానంతరం ఒక సినిమా మాత్రమే చేసింది. ప్రస్తుతం గోపికకు రెండేళ్ల వయసున్న కూతురు అమీ ఉంది. భర్తతో, కూతురితో హాయిగా, ప్రశాంతంగా జీవిస్తోన్న గోపిక... తన పునరాగమనం గురించి మాత్రం నోరు విప్పడం లేదు. రాననో, వస్తాననో చెప్పకుండా సస్పెన్సే మెయిన్‌టెయిన్ చేస్తోంది. అభినయ ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి మెప్పించిన గోపిక... సినిమారంగం అంటే స్కిన్‌షో మాత్రమే అనుకుని దూరంగా జరిగిపోయే అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే నాయిక. మరోసారి సిల్వర్ స్క్రీన్ ద్వారా మనల్ని పలకరించినా పలకరించకపోయినా... మన స్వీట్ మెమొరీస్‌లో ఆమె ప్లేస్ పదిలమనేది నిస్సందేహం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Profile for zia mody
Creative director ekta kapoor interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles