సాధారణంగా కళ్లద్దాలను కంటిలోపం వున్నవారు, ఇన్ఫెక్షన్ వున్నవారు వాడుతారు. కానీ ప్రస్తుతకాలంలో కూడా ఈ కళ్లద్దాలను వాడటం ఒక ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల కళ్లద్దాలు కూడా మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ఇవి ఎంతో కలర్ ఫుల్ గా, మందంగా వుంటూ... తమవైపు ఆకర్షించుకునేలా వుంటాయి. ఇటువంటి మోడ్రన్ అద్దాలను ధరించిన అమ్మాయిలు ఎంతో గ్లామరస్ గా, బోల్డ్ గా కనిపిస్తారు.
అయితే ఇవి నేచురల్ గా కొంతమంది అమ్మాయిలకు మాత్రమే చాలా అందంగా కనిపిస్తాయి. కొంతమందికైతే అస్సలు సరిపోవు. అటువంటివారు కొన్ని ఐ మేకప్ టిప్స్ ను రెగ్యులర్ గా అవలంభిస్తే చాలు.. వాళ్లు కూడా మిగతావారిలాగా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.
అద్దాలను నిరంతరం వాడటం వల్ల కంటిచుట్టూ ఒక వలయ రూపంలో మచ్చలు ఏర్పడటం మొదలవుతుంది. అనుకోని పరిస్థితుల్లో అద్దాలను తీసివేస్తే కళ్లు కూడా అంత ఆకర్షణీయంగా కనిపించవు. వారిలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. ఫలితంగా వారి ముఖం కూడా అందంగా కనిపించదు. కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని ఐ మేకప్ టిప్స్ పాటిస్తే.. మీరు మీ అందాన్ని తిరిగి పొందడంతోపాటు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు.
కళ్లకు అద్దాలు పెట్టుకునే అమ్మాయిలకు ఐ మేకప్ టిప్స్ :
1. ముఖ్యంగా మీరు కళ్లకోసం అద్దాలను తీసుకునేముందు వాటి పరిమాణం గురించి తెలుసుకుంటే మంచిది. అంటే మీ ఆకృతికి సరిపోయే పల్చటి లేదా మందం అద్దాలను, మీ అందానికి తగ్గట్టుగా కలర్లను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. పైగా అద్దాల సైజ్ చాలావరకు చిన్నదిగా వుండేటట్లు చూసుకుంటే శ్రేయస్కరం. ఇలా తీసుకుంటే మీలో ఒక కొత్త అందం బయటికి వస్తుంది. ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తారు.
2. అద్దాలు పెట్టుకున్నవారు ముందుగా తమ ఐ బ్రోస్ ను అందంగా వుండేలా చూసుకోవాలి. అద్దాలు పెట్టుకున్నప్పుడు అవి కంటి పరిమాణాన్ని ఆక్రమించగా.. ఐ బ్రోలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. అటువంటి సమయాల్లో వాటిని అందంగా మలుచుకుంటే మీరు అందంగా కనిపిస్తారు. ఐ బ్రోలు ఒక పర్ ఫెక్ట్ షేప్ లో వుండేవిధంగా రెగ్యులర్ గా మెయింటెయిన్ చేస్తూ వుండాలి. అవసరమైతే దానికి సంబంధించిన ఒక బ్యూటీషియన్ సలహాలు కూడా తీసుకోండి. ఐ బ్రోల పరిమాణం ఎంత బాగుంటే.. మీరు అంతే అందంగా కనిపిస్తారు.
3. కళ్లకు లైటుగా మస్కరా వేసుకోవడం కూడా ఎంతో అందంగా అగుపిస్తుంది. ఇలా మస్కరా వేసుకోవడం వల్ల అద్దాల మీద రిఫ్లెక్ట్ అయి మరి ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆస్కారం వుంటుంది. అలాగే ఐ షాడోను కూడా చాలా వరకు నియంత్రించాలి. అద్దాలు పెట్టుకున్న సందర్భంలో ఐ షాడో వేసుకోవడం అనవసరం. ఈ ఐ షాడో అద్దాలు వేసుకోని సందర్భంలోనే అందంగా కనిపిస్తాయి.
4. అద్దాలు పెట్టుకునేవారు మరింత అందంగా కనిపించాలంటే.. దానికి తగినట్లుగానే నాణ్యమైన, చెరగని వాటర్ వాటర్ ఫ్రూఫ్ ఐ లైనర్ ను తీసుకుంటే చాలా మంచిది. అద్దాలు పెట్టుకున్నప్పుడు కళ్ల చిన్నవిగా కనిపిస్తాయి. అటువంటి సమయాల్లో ఈ ఐ లైనర్ లు కళ్లు పెద్దవిగా కనిపించేటట్లు చేసి, ఆకర్షణీయంగా వుండేటట్లు చేస్తాయి.
5. అద్దాలలో రకరకాల రంగులను బట్టి మీరు మీ పెదాలకు కూడా లిప్ స్టిక్స్ రాసుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇలా చేసుకోవడంతో మీ ఫేస్ మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే మీ బుగ్గలు ఎర్రగా కనబడేలా చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది ఇంటి నుంచి బయటకు రావడమే మానేస్తారు. వేసవిలో భూమి, సూర్యునికి కొద్ది దగ్గరగా వెళతాడు. దాంతో సూర్యుని ప్రతాపం భూమి ఎక్కువ అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు... Read more
May 14 | కళ్లు... మహిళల అందాలను మరింత ఆకర్షణీయంగా పెంపొందించడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సాధారణంగా మహిళలు తమ హావభావాలను కూడా ఈ కళ్ల ద్వారా వెల్లడిస్తారు. అమ్మాయిల అందం సాధ్యమైనంతవరకు కళ్ల మీదే ఆధారపడి... Read more
Apr 29 | రోజువారిగా నిర్వహించుకునే కార్యకలాపాలలో కొన్ని ప్రణాళికబద్ధమైన మార్పులను తెచ్చుకుంటే.. రోజంతా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడపచ్చు. అదెలా అంటే... అందాన్ని పొందడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ముఖంపై చిరునవ్వు లేకపోతే సహజ... Read more
Apr 24 | పెళ్లికానున్న ప్రతిఒక్క మహిళ తాను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. దానికి సంబంధించిన రకరకాల పద్ధతులను కూడా అవలంభించుకుంటారు. చర్మం నిగనిగలాడేందుకు, జుట్టు రాలకుండా వుండేందుకు, చేతులు మృదువుగా కనిపించేందుకు... ఇలా రకరకాలుగా... Read more
Apr 07 | అందం విషయంలో మహిళలు ఏం చేయడానికైనా వెనుకాడరు... ఎంత డబ్బు వెచ్చించడానికైనా వారు సిద్ధంగా వుంటారు. నలుగురిలో తమ పర్సనాలిటీని అందంగా మార్చుకోవడానికి ఎటువంటి పద్ధతులనైనా అనుసరిస్తారు. అమ్మాయిలు అందంగా కనిపించడంలో జుట్టు పాత్ర... Read more