స్వర్ణ ఒప్పందంపై సంతకం చేసిన పివీ సింధూ.. Rio Olympics star PV Sindhu signs Rs 50 crore deal

Olympics silver medalist pv sindhu lands rs 50 cr endorsement deals

Abhinav Bindra, Earnings, endorsements, Forbes List, Harish Bijoor, PV Sindhu, endorsements, Tuhin Mishra, Baseline, Rajyavardhan Rathore, Saina Nehwal, Sania Mirza, Badminton, Badminton news, cricket, cricket news, sports, sports news

Badminton player PV Sindhu, who won silver medal at the Rio Olympics, has bagged a Rs 50 crore endorsement deal for three years from various companies

రియో రజత పతక విజేత పివీ సింధూ.. గోల్డన్ డీల్..

Posted: 09/27/2016 07:52 PM IST
Olympics silver medalist pv sindhu lands rs 50 cr endorsement deals

దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన మహామహా క్రీడాకారులను తోసిరాజుతూ.. రియో ఒలింపిక్స్ లో వెండి పతకంతో మెరిసిన బాడ్మీంటన్ బంగారుకొండ పీవీ సింధు తన భవిష్యత్ ను స్వర్ణంమయం చేసుకుంటుంది. తాను నమ్ముకున్న క్రీడలో బాగా రాణించడంతో అమె ప్రతిభకు కొలమానంగా అమెపై కాసుల పంట కురుస్తుంది. ‘సిల్వర్’ సింధు రూ. 50 కోట్లు విలువ చేసే గోల్డెన్ డీల్ పై సంతకాలు చేసినట్టు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. వ్యాపార సంస్థలతో ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్న క్రికెటేతర ప్లేయర్ గా సింధు ఘనత సాధించింది. ఆమెతో స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ ’బేస్ లైన్’  మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

సింధు సంతకం చేసిన బెస్ట్ డీల్ ఇదేనని ’బేస్ లైన్’  డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు తుహిన్ మిశ్రా తెలిపారు. ‘సింధుకు పెరుగుతున్న పాపులారిటీని వినియోగించుకునేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ఆమె బ్రాండ్ వేల్యూను అత్యధిస్థాయికి పెంచేందుకు ప్రయత్నిస్తాం. ఒలింపిక్స్ అద్భుత విజయం సాధించిన తర్వాత సింధు చూసిన అణకువ, విలువ ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్లింద’ని మిశ్రా అన్నారు.

ఇక నుంచి సింధు బ్రాండ్ ప్రొఫెలింగ్, లైసెన్సింగ్, ఎండార్స్ మెంట్స్ ను ‘బేస్ లైన్’  పర్యవేక్షించనుంది. సింధు తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని ఇప్పటివరకు 16 కంపెనీలు సంప్రదించాయని మిశ్రా వెల్లడించారు. తొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు దాదాపు ఖరారయ్యాయని తెలిపారు. వచ్చే వారంలో ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశముందన్నారు. కంపెనీలు పేర్లు ఇప్పుడు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. సింధు ప్రాక్టీసుకు భంగం కలగకుండా ఆమెతో వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేయిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Rajyavardhan Rathore  Saina Nehwal  Sania Mirza  Badminton  

Other Articles