Mohd Shami turns TeamIndia Remarkable Comeback అసీస్ అంచనాలను తుంచిన షమీ..

Twitter erupts as mohammad shami s six fer helps india script remarkable comeback

India vs Australia, IND vs AUS, AUS vs IND, India Tour of Australia, Perth Test, India vs Australia day 4 score, Mohammad Shami, Perth test Mohd Shami, India vs Australia updates, Cricket score, sports news,sports, latest sports news, cricket news, cricket

After the morning session belonged to Australia, Mohd Shami has turned it around quickly in the post lunch session. He has picked up the wickets of Paine, Finch and Khawaja to leave the hosts reeling.

అసీస్ అంచనాలను తుంచిన షమీ..

Posted: 12/17/2018 06:48 PM IST
Twitter erupts as mohammad shami s six fer helps india script remarkable comeback

ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ పట్టుబిగించింది. పెర్త్ టెస్టులో అసీస్ బ్యాట్స్ మెన్లు చెలరేగిపోతూ తమ స్కోరును అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న క్రమంలో టీమిండియా బౌటర్ షమీ వారిపై విరుచుకుపడ్డాడు. ఇవాళ జరుగుతున్న రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న కంగారు బ్యాట్స్ మెన్లు.. భోజన విరామానికి ముందు టీమిండియా బౌటర్లను అడుకున్నారు.

కాగా రెండో సెషన్ వచ్చేసరికి టెస్టులో పట్టు సాధించేందుకు సిద్దమైన అసీస్ బ్యాట్స్ మెన్ల నడ్డివిరిచాడు మహమ్మద్ షమీ. నాలుగోరోజు కొనసాగుతున్న ఆటలో ఓవర్ నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్ ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును రెండో సెషన్ ఆరంభంలోనే వరసగా మూడు వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టాడు షమీ. జట్టు స్కోరు 192 వద్ద ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ (37) వెనుదిరిగాడు.

 గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ తీసుకున్న అరోన్ ఫించ్ (25) ఇవాళ మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైపోయాడు. ఈ దశలో దూకుడు పెంచేందుకు ప్రయత్నించిన ఉస్మాన్ ఖవాజా (72) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ ముగ్గురినీ మహ్మద్ షమీ వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించడం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియా 198/7తో కొనసాగుతుండగా.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే 241 ఆధిక్యంలో ఆ జట్టు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IND vs AUS  Mohammad Shami  Team India  Australia  perth test  Cricket  sports  

Other Articles