Proteas welcome AB back into squad అతిధ్య జట్టుకు తొడైన బలం.. కెప్టెన్ డివిలయర్స్ ఇన్

India vs south africa ab de villiers returns to proteas squad

Cricket, johanesburg, ODI, ab de villiers, India Vs South Africa, India vs South Africa first ODI, India's tour of South Africa, ODI Cricket, South Africa captain, South Africa vs India 2018, Virat Kohli, Sports news, latest news, sports, cricket news, cricket

Finally some good news for the hosts as stalwart AB De Villiers has been added into the South African squad for the remaining three ODIs of the six-match series against India.

అతిధ్య జట్టుకు తొడైన బలం.. డివిలయర్స్ ఇన్

Posted: 02/08/2018 06:15 PM IST
India vs south africa ab de villiers returns to proteas squad

అతిధ్య జట్టు దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా దిగ్గజ బ్యాట్స్ మెన్లు అందరూ టీమిండియాతో వన్డే సిరీస్ కు దూరమవుతున్న క్రమంలో జట్టును అదుకునేందుకు మరో బలం శనివారం జోహనెస్ బర్గ్ లో జరగనున్న నాలుగో వన్డేలో వచ్చి చేరింది. భారత్‌తో వన్డే సిరీస్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికాకు ఆ బలం స్వల్ప ఊరటనివ్వనుంది.

ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ వేలి గాయం నుంచి కోలుకున్నాడు. అతను మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఏబీ చివరి మూడు వన్డేలకు అందుబాటులో ఉంటాడు. టెస్టు సిరీస్‌లో ఆడిన డివిలియర్స్‌ తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌.. దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించింది. ఏబీ రాక.. ఏకపక్షంగా సాగుతున్న సిరీస్‌పై మళ్లీ ఆసక్తిని పెంచేదే.

తొలి వన్డే తర్వాత డుప్లెసిస్‌, రెండో వన్డే తర్వాత డికాక్‌ కూడా గాయాలతో సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. డుప్లెసిస్‌ స్థానంలో రెండు, మూడు వన్డేలకు యువ ఆటగాడు మార్‌క్రమ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఏబీ కెప్టెన్సీ చేపట్టే అవకాశముంది. జోహానెస్‌బర్గ్‌లో శనివారం నాలుగో వన్డే జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ab de villiers  India Vs South Africa  johanesburg  ODI Cricket  Virat Kohli  cricket  

Other Articles