Bhuvi and zaheer khan Gets Married with girl friends ఆ ఇద్దరు పేసర్లు ఇంటివాళ్లు అయ్యారు..

Bhuvi and zaheer khan gets married with girl friends

zaheer khan, sagarika, bhuvaneshwar kumar, nupur nagar, marriage, pacers, indian cricket team, bcci, cricket news, sports news, Team India, cricket

Pacer Bhuvneshwar Kumar ties the knot with his fiancee Nupur Nagar, After former Indian cricketer Zaheer Khan finally getting married to Chak De! India star Sagarika Ghatge.

ఆ ఇద్దరు పేసర్లు ఇంటివాళ్లు అయ్యారు..

Posted: 11/23/2017 08:58 PM IST
Bhuvi and zaheer khan gets married with girl friends

టీమిండియా మాజీ పేసర్, ప్రస్తుత డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరొందిన ఇద్దరు ఇవాళ ఒక్కరోజునే ఇంటివాళ్లలయ్యారు. ఎవరా ఇద్దరూ అంటే ఒకరు మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌.. మరోకరు టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్. బాలీవుడ్‌ భామ సాగరికతో ఇవాళ జహీర్‌ వివాహం నిరాడంబరంగా జరిగింది. గులాబి రంగు కుర్తాలో జహీర్‌, నారింజ పండు రంగు చీర, ప్రత్యేక ఆభరణాలు ధరించిన సాగరిక జోడీ అతికొద్ది మంది బంధువుల మధ్య ఒక్కటయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి స్నేహితులు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఈ నెల 27న ముంబైలోని తాజ్ మహల్‌ ప్యాలెస్ లో వీరు తమ వివాహ విందును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో జహీర్‌.. సాగరికను గోవా తీసుకెళ్లి తన ప్రేమ విషయం తెలిపాడు. జహీర్‌ ప్రపోజల్ కు సాగరిక ఓకే చెప్పింది. ఏప్రిల్ లో నిశ్చితార్థం జరిగినట్లు ట్విటర్‌ వేదికగా జహీర్‌ అభిమానులకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక టీమిండియా పేస్ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్ కూడా ఇవాళే ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి నుపుర్ నగర్ ను ఇవాళ భువి పరిణయమాడాడు. మీరట్ లో ఘనంగా జరిగిన ఈ పెళ్లి.. పరిమితమైన సంఖ్యలో బంధువుల మధ్య సాగింది. ఈ నెల 26న బులంద్ షహర్ లో, నవంబర్‌ 30న ఢిల్లీలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితమే భువి పెళ్లి సందడి ప్రారంభమైంది. మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అక్టోబర్‌ 4న భువి, నుపూర్ ల నిశ్చితార్థం జరిగింది. ఈ పెళ్లితో జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భువీకి టీమిండియా ఆటగాళ్లు పలువురు ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. తన వివాహం నేపథ్యంలో భువి శ్రీలంకతో రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. ఇదిలావుండగా, జహీర్-సాగరికల పెళ్లి వేడుకకు అతని సన్నిహిత క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, ఆసీస్‌ నెహ్రా, అజిత్‌ అగార్కర్‌ తదితరులు హాజరైనట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zaheer khan  sagarika  bhuvaneshwar kumar  nupur nagar  marriage  pacers  indian cricket team  bcci  cricket  

Other Articles