India, Sri Lanka await Nagpur's 'green' challenge పట్టుకోసం టీమిండియా, ప్రతీకారం కోసం లంక సై..

2nd test india sri lanka await nagpur s green challenge

Virat Kohli, vca stadium, nagpur test, sri lanka, Teamindia, sri lanka in india 2017, india v sri lanka, ind vs sl, chatteswar pujara, Dinesh Chandimal, sports news, cricket

supremely confident India are set to make some strategic changes to ensure that their dominance of Sri Lanka continues unchallenged in the second match

నాగ్ పూర్ టెస్టు: పట్టుకోసం టీమిండియా, ప్రతీకారం కోసం లంక సై..

Posted: 11/23/2017 08:13 PM IST
2nd test india sri lanka await nagpur s green challenge

పర్యాటక జట్టు శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయతీరపు అంచుల వరకు చేరిన టీమిండియాకు వరుణుడు అడ్డుగా నిలవడంతో మూడు వికెట్ల దూరంలో గెలుపును చేజార్చుకున్న విరాట్ సేన నాగ్ పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభం కానున్న రెండో టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో అడాలని భావిస్తుంది.

అయితే లంక పర్యటనలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నధమైన లంక.. వరుణుడి మద్దతుతో ఓటమి అంచులకు చేరినా తప్పించుకోగలిగింది. రెండో టెస్టులో మాత్రం భారత్ కు అధిపత్యం అందిస్తే సిరీస్ చేజారినట్టేనని భావిస్తున్న లంక.. తొలి టెస్టు డ్రా కావడంతో మిగిలిన రెండు టెస్టులను తమ ఖాతాలో వేసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక అటు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో క్రికెటర్లు నాగ్ పూర్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.

తొలి టెస్ట్ డ్రాగా ముగియడంతో విరాట్ సేన రెండో టెస్టులో శ్రీలంకపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. రెండో టెస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ ఆడడం లేదు. వీరి స్థానంలో ఎవరి ఎంపిక చేస్తారో వేచిచూడాలి మరి. అయితే భువి స్తానంలో మాత్రం తమిళనాడుకు చెందిన పేసర్ కు అవకాశం దక్కనుందన్న సమాచారం. కాగా, ధావన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నవేచి చూడాల్సిందే.

బీసీసీఐపై కోహ్లీ మండిపాటు

విశ్రాంతి లేకుండా ఒకదాని వెనుక మ‌రకటి అలా వరుస సిరీస్ లను నిర్వ‌హించ‌డంపై విరాట్ కోహ్లీ తీవ్ర అభ్యంత‌రం తెలిపాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న‌ శ్రీలంక భార‌త్‌ సిరీస్ ముగిసిన వెంటనే ద‌క్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనున్న నేపథ్యంలో కోహ్లీ ఫైర్ అయ్యారు. అటపైనే తప్ప అటగాళ్ల అరోగ్యంపై బిసిసిఐ శ్రద్ద చూపడం లేదని మండిపడ్డారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో మళ్లీ పయనం కావాలంటే తమను పరీక్షించినట్టేనని అన్నారు. మరో గత్యంతరం లేకనే తాము అడుతున్నామని కోహ్లీ అన్నాడు. త‌మ‌కు ఒక నెల గడువు దొరికినట్టయితే, తాము సరిగ్గా ద‌క్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లమ‌ని చెప్పాడు. సిరీస్‌లు ఆడడంలో సరైన ప్లానింగ్ ఉండాల‌ని వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  nagpur test  sri lanka  Teamindia  india v sri lanka  ind vs sl  chatteswar pujara  cricket  

Other Articles