Gayle wins Australia masseuse court case క్రిస్ గేల్ అస్ట్రేలియాలో గెలిచాడహో..!

Chris gayle wins defamation suit in australia

Chris Gayle, Fairfax Media, Indies, New South Wales, New South Wales Supreme Court, Sydney, United Kingdom, West Indies

West Indies batsman Chris Gayle has won the defamation case against an Australian media which alleged that he exposed himself to a female massage therapist during a Sydney training session in the 2015 Cricket World Cup.

క్రిస్ గేల్ అస్ట్రేలియాలో గెలిచాడహో..!

Posted: 10/30/2017 08:17 PM IST
Chris gayle wins defamation suit in australia

వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ అస్ట్రేలియాలో గెలిచాడు. అదేంటి వీండీస్ అసీస్ మధ్య ఎలాంటి సిరీస్ జరగకపోయినా.. అలా ఎలా గెలుస్తాడు అని డౌట్స్ వస్తున్నాయా.? అయితే ఇది మైదానంలో కాదు కోర్టులో.. ఓ పత్రిక తన పరువు ప్రతీష్టలను దెబ్బతీస్తూ రాసిన కథానలపై ఆయన అక్కడి కోర్టులో కేసు వేశాడు. అసీస్ మీడియా గ్రూపు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నింస్తోందని ఆయన గత వారం అస్ట్రేలియాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు గేల్ కు అనుకూలంగా తీర్పును వెలువరించింది.

2015 ప్రపంచకప్ సందర్భంగా గేల్ డ్రస్సింగ్ రూమ్ లో మసాజ్ థెరపిస్ట్ కు తన మర్మాంగాన్ని కనిపించేలా డ్రెస్ చేసుకున్నాడని, గత జనవరిలో ఫెయిర్ ఫాక్స్ మీడియాకు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌, ద ఏజ్‌, ద కాన్ బెర్రా టైమ్స్ పేర్కొన్నాయి. దీనిపై మండిపడిన గేల్ వాటిపై న్యాయస్థానంలో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారించిన ఎన్ఎస్ డబ్ల్యూ సుప్రీంకోర్టు గేల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం మీడియాపై పలు కామెంట్లను చేసింది. పాఠకుల కోణంలో అలోచించి కథనాలు రాస్తున్నారే తప్ప, వాటి ద్వారా ఎవరికైనా ఎంతటి గాయం కలుగుతుందో అలోచించడం లేదని అన్నారు. నిజాలతో పనిలేదన్నట్లు ఈ వార్తలను ప్రచురిస్తున్నారన్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించే వ్యక్తి పట్ల అప్రమత్తత లేకుండా ఎలా వ్యవహరిస్తారని న్యాయస్థానం మండిపడింది. తనకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన గేల్.. తాను మంచి వ్యక్తిని. సిగ్గుగా ఏమీ ఫీలవ్వడం లేదు. చాలా సంతోషంగా ఉన్నా.’ అని గేల్‌ స్థానిక మీడియాతో ఉద్వేగంగా మాట్లాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles