Do not behave like Indian spectators: Arjuna మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్

Arjuna ranatunga to sri lanka fans don t behave like indian spectators

sri lanka, eden gardens, kolkata, pallekele international cricket stadium, Arjuna Ranatunga, Sri Lanka Cricket, India vs Sri lanka, cricket news, sports news, sports, cricket

Arujan Ranatunga is well known for making controversial statements and stirring the pot is mostly in the news nowadays for his remarks about something or the other.

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్

Posted: 08/29/2017 08:43 PM IST
Arjuna ranatunga to sri lanka fans don t behave like indian spectators

వివాదాస్పద వ్యాక్యలు చేయడంతో కీలకంగా మారిన శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ మరోమారు అచ్చంగా అలాంటి వాఖ్యలే చేసిన టీమిండియా జట్టు అభిమానులతో పాటు యావత్ దేశప్రజల అగ్రహానికి గురవుతున్నాడు. ఐదో వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో శ్రీలంక అభిమానులు ఆగ్రహంతో మైదానంలోకి బాటిళ్లు విసరడంతో సుమారు 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను నిలిపివేశారు.

ఈ ఘటనపై మాజీ క్రికెటర‌, మంత్రి అర్జున రణతుంగ స్పందించారు. ‘క్యాండీలో భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచులో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. లంక అభిమానులు కాస్త ఓర్పుతో ఉండాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయవద్దు. లంక ప్రజలు క్రికెట్ ని ప్రేమిస్తారు. మేము మ్యాచ్ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు. క్రికెట్ కోసం ఎన్నో వదులుకున్నాం. వరుస ఓటములతో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమానుల్ని ఒకటే కోరుతున్నాను. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉంది. ఇలాంటి ప్రవర్తనను మన చరిత్ర, సంస్కృతి ఒప్పుకోదు’ అని రణతుంగ అన్నాడు. 1996లో ప్రపంచకప్ సెమీస్‌లో ఈడెన్ గార్డెన్లో భారత్‌-లంక జట్లు తలపడ్డాయి. భారత్‌ వరుస వికెట్లు కోల్పోతుండటంతో అభిమానులు వాటర్ బాటిల్స్‌ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి గొడవ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రణతంగ పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles