Sourav Ganguly on Ravi Shastri’s comment రవిశాస్త్రీ వ్యాఖ్యలపై గంగూలీ ఎమ్మన్నాడంటే..

Sourav ganguly shies away from commenting on ravi shastri s remark

Sri Lanka vs India 2017, Indian Cricket, ravi shastri, sourav ganguly, sachin tendulkar, vvs laxman, indian cricket head coach, sl vs ind, current team, teams of the past, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

Earlier this week, the current Indian coach Ravi Shastri had drawn an indirect comparison of the current team with the teams of the past

రవిశాస్త్రీ వ్యాఖ్యలపై గంగూలీ ఎమ్మన్నాడంటే..

Posted: 08/03/2017 05:04 PM IST
Sourav ganguly shies away from commenting on ravi shastri s remark

టీమిండియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇటీవల చేసిన కామెంట్లపై మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ భిన్నంగా స్పందించాడు. ఓ వైపు అతనికి చురకలంటిస్తూనే తాను వాటిపై కామెంట్లు చేయదలుచుకోలేదని చెప్పాడు. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారత జట్లకు సాధ్యం కాని విజయాన్ని విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని యువ జట్టు అందుకుందని శాస్త్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. దిగ్గజాలను అవమానించేలా వున్నాయని క్రికెట్ అభిమానులు ఆయనపై తీవ్రంగా ఫైర్ అయిన నేపథ్యంలో రవిశాస్త్రీ వ్యాఖ్యలపూ గంగూలీ స్పందించాడు. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్ పై సాధించిన విజయాలను శాస్త్రి మర్చిపోయాడని దాదా అన్నాడు.

వాస్తవానికి రవిశాస్త్రీ వ్యాఖ్యలపై తాను అంతగా మాట్లాడదలుచుకోలేదని అన్నాడు. అయితే మాటల విషయం ఎలా వున్నా చేతల్లో మాత్రం రుజువు చేయాలని చెప్పాడు. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్ తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ అతనికి మంచి ఉద్యోగం ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుని 2019 ప్రపంచ కప్‌ టోర్నీ వరకు కోచ్ పదవిలో కొనసాగి.. దేశానికి ట్రోఫీ అందించేలా కృషి చేయాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఇలా అంటూనే గతంలో టీమిండియా విజయాలను అందుకోలేదని భావం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించాడు.

2007లో ఇంగ్లాండ్ ను వారిసొంత గడ్డపైనే ఓడించిన విషయాన్ని.. దాయాదీ పాక్ ను కూడా వారి సొంతగడ్డపైనే చిత్తు చేసిన విషయాలు మర్చిపోవద్దని సూచిస్తూనే.. వీటిని ఒకదానితో మరోకదానిని పోల్చవద్దని సూచిస్తూనే.. విరాట్ సేన మరిన్న విజయాలను అందుకునే సేవలను అందించాలని గంగూలీ అన్నాడు. అసలు రవిశాస్త్రీ ఏమన్నాడంటే.. గతంలో దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్లకు సాధ్యం కాని విజయాలను ఇప్పటికే ప్రస్తుత జట్టులోని కుర్రాళ్లు అందుకున్నారని.. దేశం తరఫున 20 ఏళ్ల ఆడిన వాళ్లు.. శ్రీలంకలో ఎన్నో సార్లు పర్యటించినా సిరీస్‌ గెలవలేదన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  Ravi Shastri  head coach  indian cricket team  Virat Kohli  cricket  

Other Articles