Haris Sohail vows to perform his best against India టీమిండియాపై తన సత్తా చూపుతాడట..

Haris sohail vows to perform his best against india

Champions Trophy, india vs pakistan, Haris Sohail, Umar Akmal, Team india, cricket

Pakistan batsman Haris Sohail, has insisted that he is ready to give his all in the tournament opener against arch-rivals India.

టీమిండియాపై తన సత్తా చూపుతాడట..

Posted: 05/24/2017 08:51 PM IST
Haris sohail vows to perform his best against india

పాకిస్థాన్ జట్టులో అదృష్టవశాత్తు స్థానం దక్కించుకున్న ఆటగాడు తుదిజట్టులో స్థానం సంపాదించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడు. పాక్ స్టార్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఫిట్ నెస్ పరీక్షలో విఫలం కావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతని స్థానంలో హారిస్ సొహైల్ ను ఎంపిక చేసింది. ఒక ఆటగాడు గాయపడి ఇంటికి పరిమితమైతే కానీ స్థానం సంపాదించని హారిస్ సోహల్ టీమిండియాపై తన సత్తాను చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు.

భారత్ తో మ్యాచ్ లో ఆడే అవకాశం వస్తే భారత్ కు తన సత్తా చూపిస్తానని చెప్పాడు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి ఆటగాడు భారత్ పై బాగా ఆడాలని కోరుకుంటాడని, తనకు అవకాశం వస్తే, ఉత్తమ ఆటతీరు ప్రదర్శిస్తానని అన్నాడు. 2015లో జింబాబ్వేతో ఆడిన సందర్భంగా జట్టులో స్థానం సంపాదించుకున్న సొహైల్ తరువాత స్థానం కోల్పోయాడు. కాగా, జూన్ 4న టీమిండియాతో తొలి మ్యాచ్ లో పాక్ జట్టు తలపడనుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  india vs pakistan  Haris Sohail  Umar Akmal  Team india  cricket  

Other Articles