అరుదైన రికార్డును అందుకోని ఆ ‘ఇద్దరు’ Joe Root and Jonny Bairstow fall short of Vaughan ...

India vs england joe root and jonny bairstow fall short of vaughan

india vs england, ind vs eng, ind vs eng 5th test, Jonny bairstow, joe root, Michael vaughan, mooen ali, moeen ali century, chennai test, jadeja, Team India, Indian cricket, Cricket news, sports news, sports, Cricket

Joe Root (88) and Jonny Bairstow fell 10 and 12 runs short respectively of their fellow Yorkshire batsman Michael Vaughan’s 2002 all-time English record of 1,481 runs in a calendar year.

అరుదైన రికార్డును అందుకోని ఆ ‘ఇద్దరు’

Posted: 12/16/2016 07:00 PM IST
India vs england joe root and jonny bairstow fall short of vaughan

సుమారు పన్నెండేళ్లుగా ఎవరి చేత బ్రేక్ కాకుండా పథిళంగా వున్న అరుదైన రికార్డును అధిగమించి తమ పేరును కొత్త రికార్డును లిఖించుకునే క్రమంలో దరదాపుల్లోకి వచ్చిన ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు దానిని అందుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. ఇంగ్లండ్ తరపున ఒక ఏడాది అత్యధిక పరుగులు రికార్డును నెలకొల్పే అవకాశాన్ని తొలుత జో రూట్ కోల్పోగా, ఆ తరువాత దాన్ని బెయిర్ స్టో కూడా మిస్సయ్యాడు.

2002లో ఇంగ్లండ్ జట్టు తరపున టెస్టుల్లో ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(1481) పేరిట ఉంది. అదే ఆ జట్టు తరపున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది.అయితే ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న జో రూట్ ఆ రికార్డుకు పది పరుగుల దూరంలో నిలిచిపోగా, బెయిర్ స్టో 12 పరుగుల దూరంలో ఆ మైలురాయిని చేరుకునే కోల్పోయాడు.

2016లో జో రూట్ మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీ సాయంతో 1471 పరుగులు నమోదు చేయగా, బెయిర్ స్టో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో  1469 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్, బెయిర్ స్టోలు వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు. ఈ మ్యాచ్ లో స్టో 49 పరుగులు చేసి అవుట్ కాగా,రూట్ 88 పరుగులు చేసి అవుటయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Jonny bairstow  joe root  Michael vaughan  england  Cricket  

Other Articles