చివరి టెస్టులో నిలకడగా రాణిస్తున్న పర్యాటక జట్టు Ravindra Jadeja Shows The Way on Day 1

India vs england moeen ali s unbeaten ton lifts england in chennai

india vs england, ind vs eng, ind vs eng 5th test, mooen ali, moeen ali century, chennai test, jadeja, Team India, Indian cricket, Cricket news, sports news, sports, Cricket

Moeen Ali capitalised on an early reprieve to score his fifth Test century and steer England to 284/4 on Day 1 in the final Test.

చివరి టెస్టులో నిలకడగా రాణిస్తున్న పర్యాటక జట్టు

Posted: 12/16/2016 06:54 PM IST
India vs england moeen ali s unbeaten ton lifts england in chennai

క్రికెట్ కు తమ దేశమే పుట్టినిల్లుగా చెప్పుకుని ప్రచారానికి తెరతీసిన ఇంగ్లాండ్ జట్టు.. భారత్ లో సుదీర్ఘ పర్యటనకు వచ్చి పరాభవం పాలైంది. మరో టెస్టు మ్యాచ్ మిగిలివుండగానే అతిధ్య జట్టు ధాటికి తట్టుకోలేక సిరీస్ ను చేతికి అందించిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో పరాభవం పాలైనట్టుగా భావించిన పర్యాటక ఇంగ్లాండ్ జట్టు చివరిదైన ఐదవ టెస్టులోనైనా కనీసం గెలుపు తీరాలకు చేరాలని శ్రమిస్తుంది.

ఇందులో భాగంగా చెన్నై వేదికగా ఇవాళ ప్రారంభమైన టెస్టులో నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (1), అలెస్టర్ కుక్(10)ఆదిలోనే నిష్క్రమించగా,  జో రూట్(88), బెయిర్ స్టో(49)లు రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 146 పరుగులు జోడించిన తరువాత రూట్  అవుటయ్యాడు.  

ఆ తరువాత మొయిన్ అలీతో కలిసి స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ జోడి 86 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత స్టో అవుటయ్యాడు. ఆపై మొయిన్ అలీ శతకం నమోదు చేసి జట్టును మరింత పటిష్ట స్థితికి చేర్చాడు. మొయిన్ అలీ పరుగుల ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యే ప్రమాదంలో చిక్కుకుని తప్పించుకున్నాడు. తన బ్యాటు నుంచి వెళ్లిన క్యాచ్ ను పట్టుకోవడంలో టీమిండియా అటగాడు కెఎల్ రాహుల్ కొంత నిర్లక్ష్యం వహించడంతో అలీ ఆటకు ప్రాణాలు వచ్చి శతకాన్ని నమోదు చేసుకున్నారు.

ఇక మరో పర్యాయం రవీంద్ర జడేజా విసిరిన బంతికి ఆయన డీఆర్ఎస్ అపీలు చేసినా.. అది ఎల్బీడబ్యూ కాదని థర్ ఎంఫైర్ నిర్ణయిస్తూ.. ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన తీర్పుతో సమ్మతాన్ని తెలపడంతో ఇక విజృంభించిన అలీ శతకాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి అలీ(120 బ్యాటింగ్), స్టోక్స్(5 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు.భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మకు వికెట్ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Team India  Indian cricket  alastair cook  Virat Kohli  england  Cricket  

Other Articles