డాబు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. PCB not keen to react as BCCI requests ICC

Pcb not keen to react as bcci requests icc

Pakistan, pakistan cricket board, PCB, Board of cricket control board, BCCI, indian cricket, International cricket council, ICC, cricket

BCCI president Anurag Thakur has requested the ICC not to have India and Pakistan in the same group for world events. But, the PCb official does not want to react to the BCCI.

డాబు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Posted: 10/02/2016 12:30 PM IST
Pcb not keen to react as bcci requests icc

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డాబు ప్రదర్శిస్తోంది. ఓ వైపు బిసిసిఐ ఐసిసికి చేసిన వినతులపై స్పందించేందకు నిరాకరిస్తూనే.. మరోవైపు తమకు భారత్ తో కలసి ఆడాలని అనుకోవడం లేదని అలాంటి అవసరం కూడా తమకు రాకపోవచ్చునని పాకిస్థాన్ అంటోంది, తమ దేశంతో ఏ ఈవెంట్ క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొనకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలికి(ఐసీసీ)లేఖ రాస్తామంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడటానికి పాకిస్తాన్ క్రికెట్  బోర్డు(పీసీబీ) నిరాకరించింది.  ప్రస్తుతం అనురాగ్ కామెంట్లపై తాము మాట్లాడటం ఎంతమాత్రం ఉపయోగం కాదని పేర్కొంది.

'ఇటీవల కాలంలో పాకిస్తాన్ క్రికెట్ పై వ్యాఖ్యలను చూస్తున్నాం. వింటున్నాం. అయితే వాటిపై స్పందించాలని మేము అనుకోవడం లేదు. ఆ అవసరం ఉందని అనుకోవడం లేదు'అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాము పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటానికి ఆసక్తిగా లేమంటూ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక గ్రూప్ స్టేజ్ లో కానీ, ప్రధాన ఈవెంట్లలో కానీ భారత్-పాకిస్తాన్ ల మ్యాచ్ ఉండకుండా చూడాలంటూ ఐసీసీకి లేఖ రాస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles