BCCI attempts to prepone Sri Lanka tour to give India players adequate rest; Sony bags broadcast rights

Bcci keen to advance sri lanka tour by one week

bcci keen to advance sri lanka tour by one week, BCCI, prepone, Sri Lanka tour, india players, adequate rest; Sony bags broadcast rights, 'One Day International Cricket, Test Cricket, Indian Cricket, Sri Lanka Cricket, South Africa Cricket, MS Dhoni, Cricket

BCCI are attempting to push forward India’s 3-Test tour of Sri Lanka in August by at least a week so that the players get sufficient rest before the series against South Africa in October.

7 రోజుల ముందుకు భారత్, శ్రీలంక టూర్

Posted: 07/08/2015 03:42 PM IST
Bcci keen to advance sri lanka tour by one week

వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక పర్యటనకు ఓ వారం ముందుగానే వెళ్లాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలను సిద్దం చేసింది. దీనివల్ల అక్టోబర్-నవంబర్ మాసాల్లో స్వదేశంలో జరిగే సౌత్ అఫ్రికా జట్టుకు ముందు ఆటగాళ్లకు తగినంతవిశ్రాంతి కల్పించాలన్న భావనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి వుంది. ఈ టూర్‌లో లంకతో టీమిండియా మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఆడనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ ఆగస్ట్‌ 11న ప్రారంభం కావాల్సింది. చివరిసారి 2010లో భారత్‌.. లంక పర్యటనకు వెళ్లింది.

కాగా ప్రస్తుతం జింబాబ్వే తో మూడు వన్డేలు, రెండు టీ-20లు అడేందుకు జింబాబ్వే చేరుకున్న టీమిండియా ఈ నెల 20న స్వదేశానికి తిరిగి రానుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని లంక టూర్‌ను సాధ్యమైనంత తర్వాత ముగించి, ఆటగాళ్లకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలని  బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో భారత్‌ నాలుగు టెస్ట్‌లు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో తలపడనుంది. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. కాగా, భారత్ - శ్రీలంక సీరిస్ కు సంబంధించిన ప్రసార హక్కులను సోని సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా 3.25 మిలియన్ డాలర్లు మన కరెస్సీలో సుమారుగా 19 కోట్ల 50 లక్షల రూపాయలను లంకబోర్డుకు ఇవ్వనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  prepone  Sri Lanka tour  india players  adequate rest; Sony bags broadcast rights  

Other Articles