MS Dhoni Quitting Forced Selectors to Hand Virat Kohli Test Captaincy: Ajit Wadekar

Kohli is captain because bcci had no choice says ajit wadekar

India,Virat Kohli,MS Dhoni,Ind in Zim, 2015,Cricket Mahendra Singh Dhoni Quitting Forced Selectors to Hand Virat Kohli Test Captaincy: Ajit Wadekar latest Ind in Zim

Mahendra Singh Dhoni retired from Test cricket after the drawn game at Melbourne last December handing the reins of the team to a much younger Virat Kohli.

కోహ్లీకి టెస్టు సారథ్యంపై వాడేకర్ సంచలన వ్యాఖ్యలు

Posted: 07/07/2015 07:24 PM IST
Kohli is captain because bcci had no choice says ajit wadekar

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ సారధ్య బాధ్యతలు దక్కడంపై అజిత్ వాడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనూహ్యంగా, ఆకస్మింకగా టెస్టు క్రికెట్ కు గుడ్ పైన చెప్పిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండిలి మరో మార్గం లేక ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్ కప్ కు ముందు అస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో ఉన్న ఫలంగా ధోని టెస్టు క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించడంతో మరో దారి లేకనే కోహ్లీకి పగ్గాలు అప్పగించారన్నాడు.

ధోనీ తప్పుకున్నాక ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగించాలి కదా అన్నారు. అందులో భాగంగా అప్పడు వైస్ కెప్టెన్ గా వున్న విరాట్ కోహ్లీకి బిసిసిఐ ఆ బాధ్యతలను అప్పగించిందన్నాడు. ధోనీ టెస్టు కెప్టెన్‌గా కొనసాగితే బాగుండుని అనిపించిందని చెప్పాడు. టెస్టుల్లో ధోనీ రికార్డ్ బాగా లేకున్నా, మిగతా ఫార్మాట్లలో అతని ప్రదర్శన, సాధించిన విజయాలు అద్భుతమన్నాడు. భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్ ధోనీయే అన్నాడు. వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలను కూడా అజిత్ వాడేకర్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  ajit wadekar  Test captaincy  

Other Articles