నలభై నాలుగు రోజుల పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులకు కంటి మీద కునుకు కరువు చేసిన 11వ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ వేడుకలు ఇవాళ్టితో ముగిసాయి. కివీస్ పై అసీస్ సాధించిన ఏడు వికెట్ల విజయంతో జగజ్జేతగా అసీస్ నిలిచింది. దీంతో వేడుకలు సమాస్తమయ్యాయి. ఈ తరుణంలో వచ్చే పర్యాయం 12వ ప్రపంచ క్రికెట్ కప్ ఎక్కడ నిర్వహిస్తారన్న ప్రశ్న అందరి మదిలోనూ మెదలుతోండి. అయితే క్రికెట్ పురటిగడ్డలోనే ఈ సారి 12వ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని, దీంతో పాటు వేల్స్ లోనూ పలు మ్యాచ్ లను నిర్వహిస్తారని సమాచారం.
క్రిస్ గేల్ డబుల్ సెంచరీ.. గప్టిల్ ప్రపంచ కప్ రికార్డు వ్యక్తిగత స్కోరు.. సంగక్కర వరుస సెంచరీల చరిత్ర.. టోర్నీలో అత్యధిక సెంచరీలు.. సరికొత్త రికార్డులు.. ధోనీసేన అత్యధిక వరుస విజయాలు.. టీమిండియా వరుస మ్యాచ్ లలో అలౌట్ చేసిన ఘనత, న్యూజిలాండ్ జైత్రయాత్ర.. దిగ్గజాల వీడ్కోలు.. ఇలా ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలను మిగిల్చింది. సెమీస్లో దక్షిణాఫ్రికా ఓటమి.. ఆఖరి మెట్టుపై న్యూజిలాండ్ నిష్ర్కమణ వంటి గుండెల్ని పిండే క్షణాలు.. ఆసీస్ ఐదోసారి ప్రపంచ కప్ అందుకోవడం అభిమానులకు గుర్తుండిపోతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 ప్రపంచ కప్ అభిమానులకు ఎన్నో చేదు, మధుర స్మృతులను మిగిల్చింది. ఫిబ్రవరి 14న ఆరంభమైన ఈ మెగా ఈవెంట్ మార్చి 29న గ్రాండ్ ఫైనల్తో విజయవంతంగా ముగిసింది. మరి వచ్చే ప్రపంచకప్ ఎన్ని రికార్డులను నెలకొల్పుతుందో వేచి చేద్దామా..!
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more