Cricketer rahane to marry neighbour

rahane, cricketer rahane, latest news, rahane marriage, rahane wife name, indian cricket team, indian cricketers, sports news, muland, cricket, rehane, neighbours, muland houses, karate classes, indian marriages, karate belts, gymnastics

indian cricketer rahane to marry his neighbour of mulandh : before the west indies series in october rahane to get marry with dopapkar of his muland house neighbour

రహానె పక్కింటి పెళ్లికొడుకాయెనే..!

Posted: 09/21/2014 04:04 PM IST
Cricketer rahane to marry neighbour

క్రికెటర్ రహానే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సిగ్గుపడే ఈ మగాడు చంకలోనే పిల్లను పెట్టుకుని కొన్నాళ్లు అమ్మాయి కోసం దేశమంతా వెతికాడు. అయితే స్వర్గంలో నిశ్చయమైన పెళ్ళిళ్ళను ఎవరూ తప్పించలేరన్నట్లుగా.., పక్కింటి అమ్మాయితో క్రికెటర్ కు పెళ్ళి కుదిరింది. వెస్టిండిస్ సిరీస్ కంటే ముందుగానే మనవాడు మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ప్రారంభించటానికి ముస్తాబవుతున్నాడు. ములంద్ లో పక్క ఇంట్లో ఉండే రాధిక దోపాప్ కర్ తో ఈనెల 26న రహానె పెళ్లి జరగనుంది.

స్వతహాగా సిగ్గుపడే వ్యక్తి అయిన రహానే పక్క ఇంట్లో ఉంటున్నా ఎప్పుడూ రాధికను సరిగా చూడలేదట. ఇద్దరి తల్లితండ్రులు కూర్చుని మాట్లాడుకుని ఈ సంబంధం ఓకే చేశారని సన్నిహితులు చెప్తున్నారు. మనవాడు ఎంత సిగ్గుపడతాడంటే.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన రహానే సొంతంగా క్లాసులకు వెళ్ళలేదు. ఆయన తండ్రి పంపిస్తే వెళ్లేవాడట. అటు రహానే తండ్రి కూడా కరాటే నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.., అందరితో మాట్లాడగలడు అనే ఉద్దేశ్యంతో క్లాసులకు పంపాడట. ఇక చాలా రోజుల తర్వాత భారత క్రికెట్ టీంలో ఓ ఆటగాడి పెళ్ళి జరగటంతో పాటు.., కొత్త, పాత ఆటగాళ్ళు కలిసేందుకు ఈ పెళ్లి వేదిక అవుతుందన్నమాట. అడ్వాన్స్ గా తెలుగు విశేష్ తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు కాబోయే రాధిక రహానే .

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahane  marriage  sports  latest news  

Other Articles