A victory farewell to cricketer jayawardene

jayawardene, jayawardene farewell, jayawardene matches, srilanka team, lanka vs pakisthan, srilanka vs india, cricket news, dhoni resignation, goodbye, latest news

srilanka team gives victory farewell to crickter jayawardene : lanka team wins on pakisthan and sends jayawardene with victory farewell from cricket

విజయంతో జయవర్ధనేకు వీడ్కోలు

Posted: 08/18/2014 06:18 PM IST
A victory farewell to cricketer jayawardene

క్రికెటర్ మహేల జయవర్ధనేకు లంక జట్టు మరపురాని వీడ్కోలు అందించింది. మాజి కెప్టెన్ కు విజయంతో కూడిన వీడ్కోలు పలికింది. పాకిస్థాన్ తో చివరి మ్యాచ్ గెలిచి విజయాన్ని మహేలకు అందించింది. ఈ విజయానందంతో క్రికెట్ కు మహేల గుడ్ బై చెప్పాడు. కెరీర్లో 149 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 11,814 పరుగులు చేశాడు. పదిహేడేళ్ళ టెస్ట్ క్రికెట్ కెరీర్ లో ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. జయ వర్ధనే ఉన్నాడంటే లంక జట్టకు పరుగుల వరద పారినట్లే అని క్రికెట్ అభిమానులు అనుకుంటారు. జట్టును గెలిపించటంలో చాలాసార్లు వర్ధనే కీలకం అయ్యాడు. టెస్ట్ లలో అత్యధిక క్యాచ్ లు (205) పట్టిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.

తన హయాంలోని క్రికెటర్లకు మహేల జయవర్ధనే స్పూర్తిగా నిలిచాడు. ఇంత పేరున్నా మైదానంలోకి వస్తే మాత్రం సైలెంట్  గా ఉంటాడు. పూర్తిగా ఆటపై ఫోకస్ చేస్తాడు తప్ప పనికిరాని కామెంట్లు, జూనియర్ల ర్యాగింగులను పట్టించుకోడు. అందువల్లనే అందరూ మహేలను మెచ్చుకుంటారు. ఇక జయవర్దనే క్రికెట్ కు దూరం అయినా ఆయన ప్రభావం మాత్రం కొన్ని సంవత్సరాలు ఆటపై ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ రికార్డులు సమం చేయాలంటే కొంత సమయం పడుతుందని అంటున్నారు. అటు క్రికెట్ కు ఇంతకాలం తాను సేవలందించటం పట్ల జయవర్ధనే సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తాను అమితంగా ఇష్టపడే గ్రౌండ్ ను, ఆలసట తీర్చుకునే డ్రెస్సింగ్ రూం ను, తన టీంను మిస్సవుతున్నందుకు కాస్త బాధగా ఉందని చెప్పాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayawardene  farewell  srilanka cricket  lanka vs pakisthan  cricket news  

Other Articles