Bcci clarifies that mahendra singh dhoni will continue as captain in next worldcup

mahendra singh dhoni, dhoni latest news, england vs india test series, mahendra singh dhoni news, 2015 world cup, bcci board, bcci chairman sanjay patel

bcci clarifies that mahendra singh dhoni will continue as captain in next worldcup : The bcci chairman sanjay patel clarifies that mahendra singh dhoni will continue as captain in next world cup also.

హమ్మయ్యా! ధోనీ బతికి బయటపడ్డాడు!

Posted: 08/20/2014 01:34 PM IST
Bcci clarifies that mahendra singh dhoni will continue as captain in next worldcup

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఓ వెలుగు వెలిగిన మహేంద్రసింగ్ ధోనీ బతికి బయటపడ్డాడు. తన ఇన్నేళ్ల కెరీర్ లో ఇటువంటి ప్రమాదంలో పడిపోతాడని ఎవ్వరూ ఊహించి వుండరు కూడా! ఓటమి అంచులదాకా పయనిస్తున్న తన జట్టును గెలుపు దిశలో తీసుకొచ్చే కెప్టెన్ గా ధోనీ మన భారతీయ చరిత్రలో ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్నాడు. 28ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ను తీసుకురావడంలో ఇతనిదే కీలకపాత్ర! బహుశా ధోనీ ఈసారి వరల్డ్ కప్ లో లేకపోయివుంటే అది ఖచ్చితంగా దక్కేది కాదు. ఆ మ్యాచ్ లో అందరూ పవేలియన్ చేరుతుండగా... ధోనీ మాత్రం ఒక్క సైనికుడిలా పోరాడి భారత్ కు కప్ దొరికేలా రాణించాడు. చివరి పరుగు సాధించేంతవరకు వెనుదిరగకుండా ‘‘ఒకేఒక్కడు’’ నాయకుడిలా పోరాడాడు.

కేవలం ఇదొక్కటే కాదు.. అప్పుడప్పుడు జరిగే వన్డే, టెస్టు మ్యాచుల్లోనూ తనదైన ప్రదర్శన కనబరుస్తూ సరికొత్త రికార్డుల్ని సృష్టించాడు ఈ మహేంద్రుడు! దీంతో మన భారత్ కు తిరుగులేని కెప్టెన్ లభించాడని అందరూ సంబరపడిపోయారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ధోనీకి ప్రస్తుత కాలం వ్యతిరేకంగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా ఆ జట్టుతో టెస్టు మ్యాచుల్లో తలపడిన ధోనీ ఘోరంగా పరాభవం ఎదుర్కున్న సంగతి తెలిసిందే! దీంతో ధోనీ మీద క్రికెట్ విశ్లేషకుల నుంచి అభిమానులదాకా అందరూ విమర్శల తూట్లు పొడవడం మొదలుపెట్టేశారు. ధోనీని కెప్టెన్ గా తొలగించాల్సిందేనంటూ ప్రతిఒక్కరు తమతమ వాదనలనూ వినిపించారు.

ఒకప్పుడు వరల్డ్ కప్ గెలిపించి భారత్ కు గౌరవాన్ని దక్కించిన ధోనీ.. ఇప్పుడు మనకు వద్దంటూ అందరూ గళం విప్పడం క్రికెట్ బోర్డు అధికారులతోపాటు యావత్తు ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కెప్టెన్ ధోనీ వైదొలగడం ఖాయమనే వార్తలు మీడియాలో బాగానే షికార్లు చేశాయి. దీనిమీద ధోనీ కూడా ఏమి స్పందించలేకపోయాడు. అయితే ఇప్పుడు ఆ వార్తలకు ఫుల్ స్టాప్ వేస్తూ ధోనీకి ఊరట లభించినట్లు తెలుస్తోంది. కెప్టెన్ గా ధోనిని తప్పించడం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసిపారేసింది.

భోర్డు కార్యదర్శి అయిన సంజయ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ధోనీపై వేటు వేయాల్సిన అవసరం లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. గేమ్ అన్నాక గెలుపు, ఓటములు సాధ్యమేనని.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఓడిన భారత్ కు పూర్తి కారణం ధోనీయేనంటూ ఆరోపణలు చేయడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. భారత్ పేలవరీతిలో ఈ సిరీస్ కోల్పోవడం పట్ల మాజీ క్రికెటర్లందరూ ధోనీ నాయకత్వ సామర్థ్యాన్ని తప్పు పట్టారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి ధోనీని తప్పించాలని వారు సూచించారు.

కానీ... బీసీసీఐ మాత్రం ఈ జార్ఖండ్ యోధుడిపై నమ్మకం వుంచింది. ఎలాగైనా టీమ్ కు మరోసారి వన్డే వరల్డ్ కప్ ను తీసుకువస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. వన్డే వరల్డ్ కప్ కు మరో ఆరు నెలలు మాత్రమే వుండటంతో కెప్టెన్ మార్పులు జట్టుపై ప్రభావం చూపుతుందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. ఏదిఏమైనా.. ధోనీ కెప్టెన్ గా వైదొలుగుతున్నాడనే అనుమానాలకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిపోయింది. రాబోయే వన్డే వరల్డ్ కప్ లోనూ ఇతడే కెప్టెన్ గా రంగంలోకి దిగనున్నాడు. ఈసారి వన్డేలో కూడా భారత్ వరల్డ్ కప్ ను సాధిస్తుందని అందరూ ఆశిద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles