Love what you do, says Navratilova | sania mirza | MP kavitha | telangana government | WTA

Telangana offers to play host to wta open again

Telangana offers to play host to WTA Open again, Martina Navratilova, Telangana Brand Ambassador Sania Mirza, Karman Kaur, Sania Mirza, Tennis, Martina Hingis, Women’s Tennis Association, Grand Slam Tennis, Wimbledon Tennis, Wimbledon, Wimbledon 2015, Tennis, Women's Doubles event, Sania Mirza,Wimbledon women's doubles, Sania Martin, Martina Hingis,Sania Mirza,Tennis, Sania Mirza Says She is Honoured to Share Wimbledon Triumph With India latest Tennis news

The Telangana State government has offered to host the Women’s Tennis Association (WTA) Open once again in the city if there is a written proposal coming from the WTA Tour

మహిళా టెన్నీస్ టోర్నీ నిర్వహించేందుకు సిద్దం

Posted: 07/16/2015 06:11 PM IST
Telangana offers to play host to wta open again

భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తొలిసారిగా.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచి చరిత్ర సృష్టించడంతో అమెను మహిళా టెన్నీస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ టైటిల్ గెలుపుతో డబుల్స్ లో  ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచన సానియాను సన్మానించిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత హాజరయ్యారు. సానియా మిర్జాను సన్మానించిన అనంతరం ప్రతిష్మాత్మక వింబుల్డన్ గెలిచినందుకు అమె అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళా టెన్నీస్ ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని చెప్పారు. వింబుల్డన్ ను సానియా గెలవడం తెలంగాణాకే కాకుండా యావత్ దేశానికి కూడా గర్వకారణమని చెప్పారు. టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవాతో కలసి సానియాను సన్మానించారు. అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ నెంబర్ వన్ ర్యాంక్ సాధించడానికి తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు. తాను సాధించిన ఈ విజయంతో భారత అమ్మాయిలు ఏదైనా సాధించవచ్చని నమ్మతారని బావిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఛాంపియన్ షిప్ డైరెక్టర్ మెలిస్సా పైన్ మాట్లాడుతూ.. తాము అనేక డబ్యూటీఏ ఈవెంట్లను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తే ఇక్కడ కూడా నిర్వహిస్తామని చెప్పారు. మెలిస్సా పైన్ వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ కవిత.. తమ ప్రభుత్వం మహిళా టెన్నీస్ అసోసియేషన్ ఈవెంట్లకు హాస్ట్ గా వ్యవహరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. అయితే కార్యక్రమాల నిర్వహణకు పై పూర్తి ప్రతిపాదిత నివేదికను సమర్పించాల్సిందిగా అమె కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  MP kavitha  

Other Articles