Govt Estimates FY20 GDP Growth At 5% దుమ్ములేపుతున్న ఎంత మంచివాడవురా! ట్రైలర్

Gdp growth seen slipping to 11 yr low of 5pc this fiscal

Latest GDP, India GDP FY20, India GDP, gross domestic product, gdp, FY20 GDP, raghuram rajan, nbfc crisis, asset quality review, stressed assets, realty sector, reserve bank of india, india gdp growth, shaktikanta das, nbfcs, Economy Policy, Economy, Growth rate, Growth slowdown, Financial year 2020, Financial year 2020 growth slowdown, business

The growth in real GDP during 2019-20 is estimated at 5 per cent as compared to the growth rate of 6.8 per cent in 2018-19, the government said.

అర్థిక సంక్షోభమేనా.. 11 ఏళ్ల కనిష్టానికి పడిపోనున్న జీడీపీ రేటు

Posted: 01/08/2020 10:34 PM IST
Gdp growth seen slipping to 11 yr low of 5pc this fiscal

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాలను ఎదుర్కోనుందని హెచ్చరించినట్లుగానే.. మునుపెన్నడూ లేనంతగా పడిపోతూ వస్తున్న భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారనుందని కేంద్రం అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే రియల్ ఎస్టేట్ రంగం, పారిశ్రామిక రంగంతో పాటు పలు రంగాలు సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని ఆయన ఇటీవల హెచ్చరించారు. 2008-09లో దేశ జీడీపీ 3.1 శాతంగా నమోదైంది.

ఇప్పటి వరకు ఇదే కనిష్టం కాగా.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కానుందని కేంద్రం అంచనాకొచ్చింది. అదే జరిగితే గత 11 ఏళ్ల తర్వాత ఇదే కనిష్ట స్థాయి కానుంది. 2018-19లో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదైంది. అయితే, ఈసారి తయారీ రంగం ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోవడంతో వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) పేర్కొంది.

అలాగే, ఈ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వస్తు తయారీ రంగం వృద్ధి రెండు శాతానికి పరిమితం కావొచ్చని కూడా తెలిపింది. కాగా,గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి భారత జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి (4.5 శాతం) కి పడిపోయింది. కేంద్రం కనుక తన ఖర్చులను తగ్గించని పక్షంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Latest GDP  India GDP FY20  India GDP  gross domestic product  gdp  FY20 GDP  realty sector  Economy  business  

Other Articles