అందుబాటు ధరల్లో అనారాయిడ్ ఫోన్లను ప్రవేశపెట్టి విజయంవంతంగా విక్రయాలను జరిపిన సాంకేతిక రంగ దిగ్గజం గూగుల్.. దేశీయ విపణిలోకి నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు నెక్సస్ 9 టాబ్లెట్‌ను త్వరలో విడుదల చేయనుంది. అమెరికా దిగ్గజ సంస్థ మోటరోలా తయారుచేసిన నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు 5.96 అంగుళాల తెర, వెనుక-ముందు 13-2 మెగాపిక్సెల్ కెమేరాలు అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 32 జీబీ వెర్షన్ ధర రూ.44,000 కాగా 64 జీబీ వెర్షన్ రూ.49,000. తైవాన్ దిగ్గజం హెచ్‌టీసీ అభివృద్ధి చేసిన 16జీబీ వైఫై మోడల్ నెక్సస్ 9 టాబ్లెట్ ధర రూ.28,900, 32 జీబీ ఎల్టీఈ (4జీ) మోడల్ ధర రూ.44,900గా గూగుల్ నిర్ణయించింది.
అయితే ఈ నెక్సెస్ 6 స్మార్ట్ ఫోన్ తో పాటు నెక్సస్ 9 టాబ్లెట్‌ను భారతీయ మార్కెట్లలో ఎప్పడు ప్రవేశపెట్టి, అమ్మాకాలకు ఎప్పుడు అందుబాటులో ఉంచనుందన్న తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ వేగంగా స్మార్ట్ ఫోన్లను కోనుగోలే చేస్తున్న దేశంగా నమోదు చేసుకుంది. గత ఒక్క ఏడాదిలోనే రమారమి నాలుగు కోట్ల నలబై లక్షల ఫోన్లు భారత్ లో అమ్ముడయ్యాయని గణంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది గూగుల్ పలు దేశీయ కంపెనీలు స్పైస్, మైక్రోమాక్స్, కార్బన్ కంపెనీల సహకారంతో ప్రవేశపెట్టిన ఆనరాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్లు కూడా భారతీయ మార్కెట్లలో బాగానే అమ్మకాలు జరిపాయి. గూగుల్ అనరాయిడ్ ఫ్లోన్లు భారత్ లో మాత్రమే ప్రవేశపెట్టింది. దీనికి అప్ గ్రేడ్ వర్షన్ గా వస్తున్న పోన్ నెక్సస్ 6గా కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more