Bhadrachalam Temple | Lord Sri Ram Temple | Sri Rama Navami Festival

Bhadrachalam temple history in which lord ram located with sita lakshmana

bhadrachalam temple story, bhadrachalam temple history, bhadrachalam temple photos, bhadrachalam temple biography, bhadrachalam temple wikipedia, lord sri ram temple, sri ramdas history, gopanna history, telugu puranalu, puranas, bhadrachalam, sri rama navami festival

Bhadrachalam Temple history in which lord ram located with sita lakshmana : The Historical story of Bhadrachalam temple Where the lord Sriram Located along with his wife Sita and brother Lakshmana. This Temple is build by his devotee gopanna who is known as Sri Ramdas.

భక్తుడి కోవెలలో కొలువైన రాముడు

Posted: 03/27/2015 09:25 PM IST
Bhadrachalam temple history in which lord ram located with sita lakshmana

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వుండే పవిత్రమైన గౌతమీనదీ తీరాన సీతా-లక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు స్వయంభువుగా కొలువైన ప్రాంతమే భద్రాద్రి క్షేత్రం. ఎంతో ప్రాచీనమైన ఈ క్షేత్రంలో ఓ ప్రత్యేకత వుంది. అదేమిటంటే.. శ్రీరాముడు పశ్చిమానానికి అభిముఖంగా వుంటూ, దక్షిణాన ప్రవహిస్తున్న గోదావరి నదిని వీక్షిస్తుంటాడు. ఈ ఆలయం రాష్ట్రంలోని రామాలయాలలోకెల్లా అతి పెద్దది. దీని గురంచి బ్రహ్మాండపురాణంలో, గౌతమీ మహత్యంలో ప్రస్తావన వుంది.

స్థలపురాణం :

శ్రీరాముడు వనవాస సమయంలో కొద్దిసేపు సేద తీర్చుకోవడానికి భద్రాచలంలో వుండే ఒక బండరాయిమీద కూర్చున్నాడు. సేద తీరిన తర్వాత రాముడు ఆ బండరాయిని అనుగ్రహించి.. ‘మరో జన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు ‘బద్రుడు’గా జన్మిస్తావు. అప్పుడు నీ కొండపైనే నేను శాశ్వతనివాసం వుంటాను’ అని వరమిచ్చాడు. రాముడిచ్చిన ఆ వరానికి ఎంతో ఆనందించిన ఆ రాయి.. భద్రునిగా జన్మించి శ్రీరాముడి కోసం తపస్సు చేయసాగాడు. అతని తపస్సుకు మెచ్చిన రాముడు.. భద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో వున్నాడట.

ఆలయ చరిత్ర :

భద్రారెడ్డి పాలెంకు కాస్త దూరంలో వుండే నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న, కామమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడైన కంచర్ల గోపన్న వుండేవాడు. ఈయన చిన్నతనం నుండి శ్రీరామభక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న.. తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా వుండటంతో... అతను గోపన్నను పాల్వంచప్రాంతానికి తహశీలుదారుగా నియమించాడు. ఆ పరగణాలోనే వున్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించిపోయాడు. అప్పుడు అతను స్వామికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతను డబ్బులకోసం ఒక ఆలోచన చేశాడు.

ఆరోజుల్లో పన్నులుగా వసూలుచేసిన ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనంను ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించాడట! దీంతో తానిషా కోపోద్రిక్తుడై గోపన్నను చరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. తరువాతి రోజుల్లో తానిషాకు రామచంద్రుడు అనుగ్రహించి లక్ష్మసమేతుడై కలలో కనిపించి తన కాలంనాటి రామమాడలను చెల్లించాడట. తానిసా ఒక్కసారిగా మేలుకుని చూడగా.. ఆలయానికి గోపన్న ఎంత డబ్బయితే వాడాడో అంతసొమ్ము రాశిగా వేసి వుందట. దీంతో తన తప్పును తెలుసుకున్న తానిషా గోపన్నను ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. ఆ సమయంలో గోపన్న నిర్మించిన ఆలయమే ప్రస్తుతం భద్రాచలంలో వున్న ఆలయం.

శ్రీరామనవమి ఉత్సవం :

స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ధ నవమినాడు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. కళ్యాణ సమయంలో అప్పటి తానిషా ప్రభుత్వ సంప్రదాయం ప్రకారం రాష్ట్రప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. ఈ కళ్యాణానికి తరించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhadrachalam temple  Sri Rama Navami Festival  Sri Ram Sita Marriage day  

Other Articles