Brahma rakshasi special article

brahma rakshasi, brahma-raksasa, brahma rakshasi in hindu epics, puranalu brahma rakshasi,

brahma rakshasi special article

'బ్రహ్మ రాక్షసి' మన మధ్యే ఉంది

Posted: 05/09/2013 06:04 PM IST
Brahma rakshasi special article

గత రెండు మూడు రోజులుగా , పోనీ ఒక వారం గా , 'బ్రమ్హ రాక్షసి' అన్న పదం మీ నోటి వెంట ఒచ్చిందా ??? మిమ్మల్ని బాగా విసిగించేవారిని , లేదా 'వీరి వల్లనే ఈ సమస్య తలెత్తింది ' అని మీరు అనుకునే వారిని ఉద్దేశించడానికి ఈ 'బిరుదు' తప్పక ఉపయోగించే ఉంటారు ...

పిల్లలు అల్లరి అతిగా చేసినా , నిద్ర పోకపోయినా , 'బ్రమ్హ రాక్షసి వె' అని వారిని సంబోధించడం కూడా కామనే ... మరి తెలియకుండానే మన జీవితం లో భాగం అయిపోయిన , ఈ పదం అర్ధం ఏంటి ? అసలు బ్రమ్హ రాక్షసి అంటే ఎవరు??? రాక్షసికి - మన తలరాత రాసే బ్రమ్హ నామం జోడించడం ఏంటి ???

ఇప్పుడైతే అవలీలగా ఏడు సముద్రాలూ దాటుతున్నాం కాని , పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం కట్టాలి అంటే గగనమే ... రాజు లైతే గుర్రాల మీద స్వారీ చేసేవారు , మరి సామాన్యులు ? కాలి నడకే శరణ్యం ... ఈ సమయం లో మార్గ మద్యం లో క్రూర మృగాలు , రాక్షుల కంట పడ్డామా , ఇక అంతే సంగతులు ...

ఇలా ఒకానొక బ్రామ్హాడు , తాను ఉన్న ప్రదేశం నుండి తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు బయలుదేరాడు ... మార్గ మద్యం లో అలసిపోయి , ఒక మర్రి చెట్టు కింద సేద తీరడానికి కూర్చుని , కునుకు అంటుకోవడం తో నిద్రలోకి జారుకున్నాడు ... ఉన్నట్టుండి , ఆ చెట్టు నుండి భయమ్కరమైఅన్ అరుపులు వినిపించి ఒక అతి భయంకరమైన రూపం , బ్రామ్హనుడికి కనపడింది ... 'బ్రమ్హ రాక్షసి' ని చూసిన బ్రామ్హనుడు పరుగులు తీయడం మొదలు పెట్టాడు . ఇతడి పరుగులని అడ్డుకున్న రాక్షసి , బ్రామ్హనుడికి వినయంగా నమస్కరించింది ... ' నీవు ఎందుకో అద్భుత శక్తి , దైవ అనుగ్రహం ఉన్న వాడిలా కనపడుతున్నావు ... నీకు నేను చేసిన పాపం చెప్పుకుంటే , నిష్కృతి పొంది నాది కాని ఈ రూపం నుండి విముక్తి పొందుతాను అని నా నమ్మకం' అని వినయంగా నమస్కరించింది 'బ్రమ్హ రాక్షసి' ...

ఆశ్చర్యపోయిన బ్రామ్హనుడు 'అసలు ఎవరు నువ్వు?' అని అడుగగా , 'బ్రమ్హ రాక్షసి' చెప్పసాగింది ... 'నేను నీ లాగే బ్రామ్హనుడిని , ఆలయ అర్చకుడిని ... కాని నేను చెయ్యని పాపం లేదు , దైవానికి భక్తులు సమర్పించే కానుకలు స్వలాభం కోసం వాడుకోవడం దగ్గరి నుండి అన్ని దురలవాట్లకు బానిసవ్వడం వరకు నాకు లేని అలవాటు లేదు ... చివరికి దైవాన్ని అలంకరించే నగలు కూడా అపహరించి అమ్ముకున్నాను ... వృద్ధాప్యం లో చేరదీసే వారు లేక నరకయాతన అనుభవిస్తూ మరణించాను. నరకానికి చేరాను. అక్కడ యమధర్మరాజు వేసిన శిక్ష అనుసారం ఇలా 'బ్రమ్హ రాక్షసి ' రూపం దాల్చాను . ఇన్నాళ్ళకు , ఉత్తముడైన నీతో తారసపడి , చేసిన తప్పులు చెప్పుకుని , నా పాపానికి నిష్కృతి పొందుతున్నాను ' , అని ఆ బ్రామ్హనుడికి నమస్కరించింది 'బ్రమ్హ రాక్షసి' ...

మనలో వృద్ధి చెందే మంచి గుణాలు , నీతి , గౌరవమైన జీవన శైలి , ఎదుటి వారిని బాధ పెట్టకుండా జీవించే తత్వమే 'భగవంతుడు'... జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడం , మన వల్ల ఇతరులని బాధ పెట్టడం , ఏ మాత్రం నీతిని పాటించకుండా , అడ్డదారుల్లో జీవించడం , అవసరమైతే ఎదుటివారి నాశనానికి పూనుకునే తత్వమే 'రాక్షసుడు' ...

దీన్ని బట్టి , మనలో భగవంతుడు 'బ్రమ్హ' ప్రతిబింబించాలా, లేక 'బ్రమ్హ రాక్షసి' నివాసం ఉండాలా అని నిర్ణయించాల్సింది మనమే …

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles