Mirchi director koratala siva interview

Mirchi director Koratala Siva Interview, Mirchi Latest Trailers, Mirchi Movie Songs, Mirchi Video Songs, Mirchi Latest Updates, Prabhas Latest Movies, Prabhas Mirchi Mp3 Songs, Prabhas Hit Movies

Mirchi director Koratala Siva Interview, Koratalla Siva Writers, Koratalla Siva (dialogue), Koratalla Siva (story) Stars, Prabhas, Anushka Shetty, Richa Gangopadhyay.

దర్శకుడు కొరటాల శివతో

Posted: 02/19/2013 09:17 PM IST
Mirchi director koratala siva interview

koratala-shiva‘భద్ర ’ చిత్రంతో రచయిత (కథ-మాటలు) గా కెరీర్‌ ప్రారంభించిన కొరటాల శివ నేడు దర్శకుడయ్యారు. తొలిసినిమానే డార్లింగ్‌ ప్రభాస్‌ని డైరెక్ట్‌ చేశారు. ఇటీవల రిలీజైన ‘మిర్చి ’ థియేటర్లలో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ విజయానకి బాటలు వేసిన సంఘటనలు ఆయన మాటల్లోనే.

* నాకు చిన్నప్పట్నుంచి రాయడం, చదవడం అంటే ఇష్టం. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం ’ చదివాక నా ఆలోచనే మారిపో యింది. ఓ రచయిత ఇంత గొప్పగా, ఇంత వైరుధ్యంగా ఆలోచి స్తారా ? అని పించింది. మహాప్రస్థానం లో శ్రీశ్రీ వాడి వేడి రచన అలా ఉం టుంది. శ్రీశ్రీ లోని విప్లవాత్మక భావా లు నాలోనూ విప్లవాన్ని రగిలించా యి. అది సినిమా రచన వైపు దారితీ సింది. దర్శకరచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నా బంధువు. దాంతో బీటెక్‌ పూర్తయ్యాక అతడి వద్ద శిష్యరికం చేశాను. రవితేజ ‘భద్ర ’కి తొలిసారి కథ, మాటలు రాశాను. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు రచయితగా పని చేశాను. ఎన్టీఆర్‌-దిల్‌రాజు-వంశీ పైడిపల్లి ‘బృందావనం ’ చిత్రానికి కూడా కథ నేనే అందించాను.

* రచయితగా కొనసాగడం దర్శకత్వం వహించడానికి సహాయపడుతుంది. నిజానికి దర్శకత్వం వహించాలంటే అన్ని విషయాల్లో పూర్తి నైపుణ్యం అవసరం లేదు. మనకు తెలిసిన ఎవరైనా పెద్ద దర్శకుడి వద్ద ఆన్‌సెట్స్‌లో పరిశీలిస్తే చాలా సాంకేతిక విషయాలు తెలుస్తాయి. కెమెరా యాంగిల్స్‌ , షాట్స్‌ పై అవగాహన వచ్చేస్తుంది.

* ఓ రచయితగా నాకు తెలిసిన విషయాల్లో... ముఖ్యంగా ఏ సినిమాకైనా కథ ముఖ్యం. దానినుంచే పాత్రలు పుడతాయి. ‘మిర్చి ’ సిని మాకి చక్కని టీమ్‌ కుదిరింది. అందువల్ల ఔట్‌పుట్‌ బాగా వచ్చింది.* దర్శకదిగ్గజం మణిరత్నం తన సినిమాల్లో గొప్ప కథని చెబుతా రు. రాజ్‌ కుమార్‌ సంతోషి సినిమాల్లోనూ కథాంశం విభిన్నంగా ఉంటుంది. వీరంతా ఎమోషన్‌, సంఘర్షణ బాగా చూపిస్తారు. నాకు ఇన్‌స్పిరేషన్‌ ఈ దర్శకులే.

* కథే సినిమాని నడిపించేది. మాటల్ని పుట్టించేది. అలాగే కథ, స్క్రిప్టు రాసుకోవడం తెలిస్తే దర్శకత్వం వహించడం కష్టమేమీ కాదు. కెమెరా షాట్‌లు తెలియాల్సిన అవసరం లేదు. రాయడం వస్తే... టెక్నికల్‌ విషయాలు సెట్స్‌కెళ్లి చూసి నేర్చేసుకోవచ్చు.

* ఇప్పటివరకూ నా కథల్ని దర్శకులు బాగానే చూపించా రు. అవసరమైతే ఆన్‌సెట్స్‌లో కూడా తమ వ్యూస్‌ని దర్శకు లు నాతో పంచుకునేవారు. అయితే నా కథల్ని నేనైతే... వారికంటే అత్యుత్తమంగా చూపించగలను అనిపించింది. భావోద్వేగాల విషయంలో నేను వారికంటే గట్టిగా చెప్పగలను. ఈ నమ్మకంతో దర్శకుడినవ్వాలనిపించింది. అయ్యాను.

* అలాగే కేవలం పుస్తకాలు చదివితేనే సినిమాకి దర్శకత్వం వహించగలం అనుకుంటే పొరపాటే. పుస్తక పఠనం అదనపు అస్సెట్‌ అంతే. సినిమాలు బాగా చూడాలి. చదవాలి. ప్రపంచ సినిమాపై అవగాహన చాలా ముఖ్యం. అన్ని జానర్‌ల సినిమాలను చూసి విశ్లేషించాలి.

shiva* కథలు రాయడంలో మన రచయితలు ప్రయోగాలు చేయగలరు. అయితే మన పరిశ్రమ పరిధిలోనే రాయడానికి ప్రయత్ని స్తున్నారంతా. ప్రయోగం వికటిస్తే ఇక్కడ మనుగడ కష్టం. అందుకే కమర్షియల్‌ కథలు ఎక్కువ వస్తున్నాయి. ప్రేక్షకుల సైకాల జీననుసరించి కూడా కథలు రాస్తారు.

* ఘాటుతో పాటు రుచి ఉండేది మిర్చి. స్పైస్ గా ఉంటుందనే ఈ పేరు ఎంపిక చేశాం. ప్రభాస్‌ పాత్రకి, శరీరభాషకి సరిపడే టైటిల్‌ ఇది. ప్రభాస్‌ కొత్త లుక్‌లో వైవిధ్యమైన పాత్రలో కనిపించే చిత్రమిది. కథానాయికలు అనుష్క, రిచా గంగోపా ధ్యాయ్‌ కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించారు. దేవీశ్రీ రీరికార్డింగ్‌ తన కెరీర్‌లోనే ది బెస్ట్‌. ఆడియో ఘనవిజయం సాధించింది. వీలైతే ప్రేమిద్దాం..పోయేదేముంది..? తిరిగి ప్రేమిస్తారు... అన్న ప్రభాస్‌ డైలాగ్‌లోనే కథంతా ఇమిడి ఉంది. ఎలాంటి క్లిష్ట సందర్భంలోనైనా హీరో చెప్పే డైలాగ్‌ ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌.

* ప్రభాస్‌ని ఊళ్లలో మాస్‌ అనుకుంటారు. అమ్మాయిలు రొమాంటిక్‌ బోయ్‌గా చూస్తారు. యువత ఐకాన్‌గా భావిస్తారు. అందుకే ఈ కథ అనుకున్నప్పుడే ప్రభాస్‌ హీరో అని భావించాం. తనకి కథ వినిపించగానే పిచ్చిగా నచ్చేసి నన్నే డైరెక్ట్‌ చేయమని అ న్నారు. తొలి సినిమా అని కూడా భావించకుండా నాకు అవకాశమి చ్చారు. బెస్ట్‌ హీరో డార్లింగ్‌. ఈగో లేని డార్లింగ్‌. కథ నచ్చితే ఏ రేంజ్‌ మార్పుకైనా సిద్ధపడతాడే హీరో. తనని తాను (లుక్‌) మార్చుకునే హీరో అతడు. డార్లింగ్‌ దొరకడం నా అదృష్టం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles