Aadhaar card helps mother trace son lodged in goa prison

aadhar card, Son missing, Kalyani, mohan, goa prison, murder case, mother, Dilapidation house, post, aguada central jail

aadhaar card helps mother trace son lodged in goa prison

పేగుబంధాన్ని కలపిన ఆధార్..

Posted: 11/13/2014 12:28 PM IST
Aadhaar card helps mother trace son lodged in goa prison

వున్నాడో, లేడో తెలియని కొడుకు.. తిరిగి వస్తాడని ఆ ఎనభై ఏళ్ల కురువృద్దురాలు. పెట్టుకున్న ఆశలను నిజం చేసింది ఆధార్ కార్డు. కొడుకు కోసం 16 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆమె ఆధార్ కార్డు సాయంతో అతని ఆచూకీ కనుగొంది. కేరళ లోని శ్రీమూలనగరం గ్రామానికి చెందిన కల్యాణి... మూడో కొడుకు వీవీ మోహన్ 16 ఏళ్ల కిందట పనికోసం గోవా వెళ్లాడు. అప్పటికే భర్త, ఇద్దరు కొడుకులను కోల్పోయిన కల్యాణి.. తన మూడో కొడుకు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. గ్రామంలోని వారు 16 ఏళ్లుగా రాని వాడు ఇప్పుడెందుకు వస్తాడని ఎంత చెప్పినా..అమె తన ఆశలను వదులుకోలేదు.

శిథిలావస్థకు చేరుకున్న తన ఇంట్లోనే గడుపుతూ, ఇరుగుపొరుగు వారు పెట్టే భోజనంతో రోజులు వెళ్లదీస్తోంది. వయసు పైబడినా, కంటిచూపు తగ్గినా ఆశ మాత్రం వదులుకోలేదు. ఇటీవల ఆమె ఇంటికి పోస్టులో ఓ కవరు వచ్చింది. దాన్ని ఆమె గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కేసీ మార్టిన్ వద్దకు తీసుకెళ్లింది. కవర్ తెరిచి చూడగా అందులో మోహన్ ఆధార్ కార్డు కనిపించింది. కల్యాణి బంధువులు, పొరుగువారు శతవిధాలా ప్రయత్నించి అతని ఆచూకీ కనుగొన్నారు. మోహన్ ఓ హత్యకేసులో 13 ఏళ్ల నుంచి గోవాలోని అగౌదా జైల్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. గత వారం జైలుకు వెళ్లి అతన్ని కలుసుకుని తల్లి పరిస్థితి గురించి చెప్పారు. అతడు తల్లిని చూసేందుకు వీలుగా పెరోల్ కోసం సన్నాహాలు చేస్తున్నామన్నారు. మొత్తానికి ఆధార్ కార్డుతో పేగుబంధం కలుస్తున్నందుకు ఆ గ్రామం అంతా సంతోషంగా వుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhar card  Son missing  Kalyani  mohan  goa prison  murder case  mother  Dilapidation house  post  aguada central jail  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more