Age restrictions of domestic workers in saudi

Age restrictions of domestic workers in Saudi, India Saudi agree on domestic workers recruitment, New laws of recruitment of domestic workers in Saudi

Age restrictions of domestic workers in Saudi as agreed by India and Saudi

సౌదీలో ఇంటిపని చేసేవారి వయసు ఎంతుండాలి

Posted: 07/23/2014 05:20 PM IST
Age restrictions of domestic workers in saudi

సౌదీ అరేబియాలో ఇళ్ళల్లో పనిచేసే భారతీయుల వయసు ఎంతుండాలన్న విషయంలో ఇరు దేశాలకు మధ్య జరిగిన ఒప్పందంలో 25-50 కి మధ్య ఉండాలని ఉంది.  ఈ విషయాన్ని సౌదీ మీడియాకు వివరించటం జరిగింది.

ఈ సందర్భంగా సౌదీ లేబర్ మినిస్ట్రీలో విదేశ వ్యవహారాల శాఖలో అండర్ సెక్రటరీ మహమ్మద్ అల్ ఫహీద్ మాట్లాడుతూ, భారత దేశంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సౌదీలో పనిచెయ్యటానికి వచ్చే డొమెస్టిక్ లేబర్ వయసు 25, 50 ల మధ్య ఉండాలని, ఒకవేళ 25 సంవత్సరాలు దాటినవాళ్ళు సౌదీలో పనిచెయ్యదలచుకుంటే భారత ప్రభుత్వం వాళ్ళకి అడ్డుచెప్పగూడదని అన్నారు.  

సౌదీ లో ఇంటి పని చెయ్యటానికి ఉత్సుకత చూపించేవారికి శిక్షణా కార్యక్రమం ఉంటుందని, సౌదీకి పంపించే ముందే వారి వారి రాష్ట్రాలలోనే ఆ శిక్షణను లేబర్ కి సంబంధించిన ఏజెంట్లు నిర్వహిస్తారని కూడా అల్ హమీద్ అన్నారు.

సౌదీ లేబర్ ఏజెన్సీలు లేబర్ నియామకంతో పాటు వీసా, శిక్షణ, తరలించే ఏర్పాటు, మొదలైన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఈ పని కోసం భారత్ లో వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలను తెరిచే పనిలో పడుతున్నారు.      సౌదీ భారత్ అధికారులు కూర్చుని భారత్ నుంచి సౌదీకి ఇళ్ళల్లో పనిచెయ్యటానికి వెళ్ళేవారి విషయంలో ఉన్న ఇబ్బందులను, మధ్యవర్తుల మోసాలను పరిగణనలోకి తీసుకుని ఆ సమస్యలను అధిగమించటానికి తగిన కట్టుదిట్టాల విషయంలో అవగాహనకు వచ్చి నియమాలను తయారుచేసుకున్నారు.  ఎంప్లోయ్ మెంట్ కాంట్రాక్ట్ లో కనీస వేతనం, పని వేళలు, శలవుదినాలు, ఏదైనా తగాదాలు వచ్చినప్పుడు వాటిని ఎలా తీర్చాలి అనే విషయాలలో నిర్ణాయలు తీసుకున్నారు.  

వయసు,  మిగతా అర్హతలతో పాటు భారత్ నుంచి వచ్చే డొమెస్టిక్ లేబర్ నడవడి బావుండాలి, నేరచరిత ఉన్నవాళ్ళు రాగూడదని, సౌదీ పనిచేస్తున్నప్పుడు మెడికల్ చెక్ అప్ చేయించుకోవాలని, అక్కడున్నంత కాలం సౌదీ నియమాలను పాటించాలని కోరారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more