Telangana govt wants to buy singareni collieries

Telangana Govt wants to buy Singareni Collieries, KCR wants to meet electricity shortage in Telangana, Talangana Govt to buy Center shares in Singareni Collieries

Telangana Govt wants to buy Singareni Collieries

సింగరేణిని కొనుక్కుంటే, సాధ్యాసాధ్యాల అధ్యయనం

Posted: 07/22/2014 09:51 AM IST
Telangana govt wants to buy singareni collieries

ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సింగరేణి బొగ్గు గనులు ఖమ్మం జిల్లాలోనే కాక కరీం నగర్ జిల్లాలో కూడా ఉన్నాయి.  తెలంగాణాలో బొగ్గు తెలంగాణాలోనే ఉపయోగించుకునేట్లుగా చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన తెలంగాణా సర్కార్ కి వచ్చింది.  విద్యుదుత్పానలో బొగ్గు బంగారంగా మారి విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్న సమయంలో సింగరేణి బొగ్గుని పూర్తిగా మనది చేసుకుంటే అనే ఆలోచన సామాన్యమైంది కాదు కదా, అందుకే సాధ్యాసాధ్యాల మీద అధ్యయనం మొదలైంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 51, 49 శాతాల వాటాలతో నడుస్తున్న సింగరేణి కోల్ మైన్స్ ని పూర్తిగా రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 49 శాతం వాటాను కూడా కొనుక్కోవలసివుంటుంది.  అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించవలసికూడా ఉంటుంది.  అయితే కేంద్ర ప్రభుత్వం వాటాలను ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో దాన్ని అధ్యయనం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం నాడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.  
ఇదే జరిగితే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గును యధేచ్చగా వాడుకుంటూ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు మేర ఉత్పాదనను పెంచుకోగలుగుతుంది.  ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న వాటా ఎక్కువే అయినా, బొగ్గు కేటాయింపులు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండటం వలన తెలంగాణాలో బొగ్గు మీద తెలంగాణాకు అధికారాలు లేకపోవటం, కేవలం లాభాల్లో వాటాలు మాత్రమే ఉండటం సరికాదని కెసిఆర్ ఆలోచన.  దానితో పాటుగా విదేశాలనుంచి కూడా బొగ్గుని దిగుమతి చేసుకుని రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చెయ్యాలన్నిది కెసిఆర్ ప్రభుత్వం ఆలోచన.  ఈ మొత్తం ప్రణాళికకు ఎన్ని నిదులు కావాలి, ఎలా సమకూర్చుకోవాలన్న చర్చలు జరుగుతున్నాయి.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more