కల్పన వైసీపీని నిజంగానే వీడుతోందా? | Uppuleti Kalpana steps to TDP.

Pamarru mla to quit jagan party

Pamarru MLA Uppuleti Kalpana, YSRCP MLA quit, Jagan birthday Kalpana quit, YSRCP to TDP, Kalpana joins TDP, Varla Ramaiah Uppuleti Kalpana, Jagan Mohan Reddy party, YCP chief Jagan Kalpana

Pamarru MLA Uppuleti Kalpana quit YSRCP and joins in TDP soon.

మరో ఎమ్మెల్యే వైసీపీని వీడనుందా?

Posted: 12/21/2016 11:32 AM IST
Pamarru mla to quit jagan party

వలసలు కాస్త కామా పడటంతో ఊరట చెందుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి ఇంకో షాక్ తగలబోతుంది. తూర్పుగోదావరి జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పనుంది. ఈ వారంలోనే ఆమె సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. గత కొంత కాలంగా వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఇటీవల జరిగిన బెల్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబుతో కలసి పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో కల్పన ఫిరాయింపు దాదాపు ఖాయమని తెలుస్తోంది.

కాగా, 2004లో టీడీపీ నుంచి కల్పన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ తరఫున నిడుమోలు నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి పాటూరి రామయ్యపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో రెండోసారి కూడా టీడీపీ టికెట్‌పై పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసి డివై దాస్‌ చేతిలో పరాజయం చెందారు. అయితే, టీడీపీలో ఉండగా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా కూడా పని చేశారు. ప్రొటోకాల్‌ విషయమై కొన్ని సందర్భాల్లో వివాదాలు మినహా ఎమ్మెల్యే కల్పన, వర్ల రామయ్య మధ్య పెద్దగా విభేదాలు లేకపోవడం ఆమెకు కలిసివచ్చే అంశమే.

ఇదిలా ఉంటే కల్పన టీడీపీలో చేరుతున్నట్టు తెలిసి మంగళవారం ఆ పార్టీ కార్యగోష్టి నుంచి హౌసింగ్‌ బోర్డు చైర్మన్, పామర్రు ఇంచార్జ్‌ వర్ల రామయ్య అలిగి వెళ్లిపోయినట్టు ప్రచారం జరిగింది. అనంతరం రామయ్య దానిపై స్పందిస్తూ.. పామర్రులో పార్టీ చాలా బలంగా ఉందని, గ్రేడింగ్‌లోనూ తనకు 'ఎ' గ్రేడ్‌ ఇచ్చిన విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి చెప్పానన్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తానని వెల్లడించారు.

అయితే కిందిస్థాయి నేతల మాత్రం కల్పన టిడిపిలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తామంతా వర్ల రామయ్యతోనే ఉంటామని వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు కల్పన జంపింగ్ దాదాపు ఖాయం కావటంతో పామర్రు వైకాపా పగ్గాలు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ కు అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pamarru MLA Uppuleti Kalpana  YSRCP to TDP  

Other Articles