Satyam | Ramalingaraju | Jail | Facts

Satyam ramalingaraju finally know the fact of life in jail

satyam, Ramalingaraju, Jail, fact, life, company, ramaraju

satyam ramalingaraju finally know the fact of life in jail. Satyam ramalinga raju who lead the some billion crore company in the past, present know the facts of life.

ఇప్పటికి సత్యం బోధపడిందట..!

Posted: 04/18/2015 11:25 AM IST
Satyam ramalingaraju finally know the fact of life in jail

అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా. ఆశా నిరాశేనా.. అంటూ ఒకప్పటి కోటీశ్వరుడు ప్రస్తుతం పాటలు పాడుతున్నాడు. ఎందుకు అలా అంటే పరిస్థితులు అలాంటివి. ఎవరు చేసిన తప్పుకు వారే శిక్ష అనుభవిస్తారని.. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలను తాకి చివరకు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. కోట్ల రూపాల మోసం చేశారని, దేశ వ్యాప్తంగా ఐటి కంపెనీలకు ఝలక్ ఇచ్చిన ఆ మహానుభావుడే.. సత్యం రామలింగరాజు. ఒకప్పుడు రామలింగరాజు అంటే లెజెండ్ కానీ ఇప్పుడు మాత్రం ఓ మామూలు ఖైదీ.

ఒకప్పుడు కోట్ల రూపాయల కంపెనీని లీడ్ చేసిన రామలింగరాజు.. ఇప్పుడు జీవిత సత్యం బోధపడిందట. అసలు జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అన్న నిజాన్ని గుర్తించారట. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన్నట్లు పుట్టిన వాడు గిట్టక మానడు.. గిట్టిన వాడు పుట్టకు మానడు.. అనివార్యమగు ఈ కార్యముల గూర్చి చింతించవలదు అన్న అక్షర సత్యాలని తెలుసుకున్నాడట. జీవితంలో వచ్చే కష్టాలు, సుఖాలు కూడా ఎన్నాళ్లో ఉండవు అవి కేవలం కొన్నాళ్లు మాత్రమే అని రామలింగరాజు ఇప్పటికి తెలుసుకున్నారు. అందుకే తన కన్నా చిన్నవాడైన రామరాజుకు హిత బోధ చేస్తున్నారట. కష్టాల్ నష్టాల్ పోతే పోనీ..పోనీ, కోపాల్, తాపాల్ వస్తే రానీ..రానీ అంటూ ఏకంగా కవితలు కూడా పాడేస్తున్నారట. అయినా అంతా అయిపోయాక ఇప్పుడు తెలుసుకొని మాత్రం ఏం ప్రయోజనం అని కొంతమంది అనుకుంటున్నారట. అయినా ఎవరు ఏం అనుకున్నా కూడా రామలింగరాజుకు వచ్చే నష్టం ఏమీ లేదు. చివరకు దీన్ని కూడా అతను గుర్తించారట.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyam  Ramalingaraju  Jail  fact  life  company  ramaraju  

Other Articles