బావ .. అక్క సంగతి చూడవా.!! అని బావమరిది అడిగితే.. బావ కాదంటాడా చెప్పండి? టైటిల్ చదివి మీరు తప్పుగా ఊహించుకోకండి? ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నడుస్తుంది. సీమాంద్రకు ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు ముందు ..అనేక సమస్యల చిట్ట ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని, .. చంద్రబాబు తిరుమల వెంకన్న స్వామి దర్శనం కూడా చేసుకోవటం జరిగింది.
సీమాంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణా స్వీకారం చేయటానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండటతో, తనతో బలమైన టీమ్ ను ఏర్పాటు చేసుకోవటంలో బిజీ బిజీ గా ఉన్నట్లు పార్టీ భవనం వద్ద కోలాహలం గా ఉంది. అయితే ముందుగా తన సొంత ఇంటి నుండి ..పని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముందుగా తన బావమరిది బాలయ్య గెలిచిన విషయాన్ని గుర్తుపెట్టుకొని, మంత్రి పదవి ఇవ్వటానికి సిద్దమయ్యే, బాలయ్యను ఇంటికి పిలిపించినట్లు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
2014 ఎన్నికల్లో హిందుపురం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్యను మంత్రి గా చూడాలని ఆయన అభిమానులు ఒత్తిడి తెస్తుతున్నట్లు పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. దీంతో చంద్రబాబు కూడా.. బాలయ్యకు మంత్రి పదవి బెర్త్ ఇవ్వటానికి బాబు రెఢీ అయిన తరుణంలో.. బాలయ్య బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. దానికి పెద్ద కారణం ఉందని పచ్చచొక్క బాబులు అంటున్నారు. రాజకీయంగా అన్నదమ్ములు, అక్క తమ్ముడుల మద్య వైరం ఉన్న విషయం తెలిసిందే.
నందమూరి కుటుంబం అంటే..తెలుగు ప్రజల్లో ఒక అభిమానం, ప్రేమ ఉన్న విషయం తెలిసిందే. అది స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాటిన బీజం కాబట్టి, ఇంకా తెలుగు ప్రజలు ఆ మహానుబావున్ని ప్రతి ఇంటిలో కుటుంబంలోని వ్యక్తిగా చూస్తున్నారు. అందుకే నందమూరి కుటుంబం పై.. అభిమానం చూపిస్తున్నారు. కానీ ఎంతైన..రక్తసంబంధమే కదా? అందులోను బాలయ్య మనసు వెన్న లాంటిదని ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఇప్పుడు అక్క పురందేశ్వరి కోసం .. బాలయ్య కష్టపడుతున్నాడు. బావ...అప్పుడే నాకు మంత్రి పదవి వద్దు...! నేను మంత్రి పదవి తీసుకుంటే.. అనేక విమర్శలు వస్తాయి, కుటుంబానికి పదవులు అంటకట్టిన చంద్రబాబుగా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తాయని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. బావ నాకు మంత్రి పదవి వద్దు... !! కానీ బావ.. అక్క (పురందేశ్వరి) సంగతి చూడవా..? అని బాలయ్య, బావ చంద్రబాబును అడిగినట్లు తెలుగుదేశం తమ్ముళ్లు ఎన్టీఆర్ భవన్ ల్లో గుసగుసలాడుకుంటున్నారు.
బాలయ్య అడిగిన వెంటనే.. చంద్రబాబు షాక్ తిన్నట్లు సమాచారం. అసలు . బాలయ్య.. నీ మనసులో ఉన్న విషయం ఏమిటి చెప్పు? అని చంద్రబాబు అడిగిన వెంటనే.. బాలయ్య అక్క పురందేశ్వరి గురించి చెప్పటం మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి హస్తం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. (తోబుట్టువులు కాబట్టి) పురందేశ్వరి అక్క .. కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి.. బిజేపిలో చేరిన విషయం కూడా తెలుసు. కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో.. అక్క పురందేశ్వరి ఓడిపోయింది కాబట్టి, మనవారికి మనమే న్యాయం చెయ్యలి బావ అని బాలయ్య చెప్పినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అక్క పురందేశ్వరి పై ఎలాంటి అవినీతి రాజకీయ విమర్శలు లేవు కాబట్టి కొంచెం ఆలోచించండని ? చంద్రబాబు కు బాలయ్య చెప్పినట్లు పచ్చ చొక్క బాబులు చెవులు కొరుక్కుంటున్నారు.(ఆ సమయంలోనే.. మాట్లాడుతూ అవినీతి మరకలు ఉన్నకాంగ్రెస్ నేతలను మన పార్టీలోకి చేర్చుకున్న విషయం బాబు కు గుర్తు చేసినట్లు తెలుస్తోంది.
భాలయ్య చెప్పిన విషయం అర్థంగాక ..చంద్రబాబు ముఖం పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్య వెంటనే.. బావ.. అక్క విషయాన్ని .. బిజేపి నేతలతో మాట్లాడి, రాజ్యసభ సీటు ఇప్పిస్తే.. అందరికి మంచిగా ఉంటుంది, భవిష్యత్తులో..అక్క మన పార్టీలోకి చేరే అవకాశాలు మొండుగా ఉన్నాయని బాలయ్య , బాబుకు చెప్పినట్లు సమాచారం. పురందేశ్వరి విషయంలో .. మన కల్పించుకుంటే, తమ్ముడు దగ్గుపాటి వెంకటేశ్వరావు ఫీలవుతాడేమోనని బాబు మనసులోని మాటను బయట పెట్టినట్లు సమాచారం.
దీంతో బాలయ్య ఆ విషయం నాకు వదిలేయండి? చిన్న బావను నేను ఒప్పించుకుంటానని బాలయ్య పెద్ద బావకు భరోసా ఇచ్చినట్లు పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉందని బాబు పార్టీలోని సీనియర్ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆలోచన ‘‘జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్’’ పై ఉన్నట్లు గా ఉందని అన్నట్లు సమాచారం. అయినా మా బాలయ్యబాబు అడిగాడు కాబట్టి కొంచెం ద్రుష్టి పెట్టి, బావమరిది కోరిక తీర్చాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీలోని బాలయ్య అభిమానులు అంటున్నారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను మన పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుందని పార్టీలోని సీనియర్ నాయకులు బాబుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందు బాలయ్య కోరిక పై పని చేద్దాం.. తరువాత మీ ఆలోచనపై ముందుకు పోదామని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. హైటెక్ మాంత్రికుడు . బాలయ్య కోరిక పై ఏ మంత్రం వేస్తాడో చూద్దాం.. జూన్ 8 తరువాత.. సీమాంద్రలో.. సిఎం బావ, ఎమ్మెల్యే బావమరది .. ఒక అక్క..? షూటింగ్ ప్రారంభం...
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more