Coal scam black shadows again on pmo

Coal scam black shadows again on PMO, Prime Ministers office, CBI inquiry on coal scam, PM advisor TKA Nair

Coal scam black shadows again on PMO

మరోసారి యుపిఏ మీద పులుముకుంటున్న బొగ్గు రంగు?

Posted: 03/22/2014 10:10 AM IST
Coal scam black shadows again on pmo

ఎన్నికల ముందు ఏ చిన్న విషయమైనా ఫలితాలలో ఎంత ప్రభావమైనా చూపించవచ్చు కాబట్టి పార్టీలన్నీ అప్రమత్తతతో మెలుగుతాయి.  అలాగే పార్టీలను చిక్కుల్లో పడేసే సందర్భాలూ ఎదురౌతాయి.  సరిగ్గా ఎన్నికలు గుమ్మంలో గడప వరకు వచ్చిన సందర్భంలో యుపిఏ మీద బొగ్గు కుంభకోణం నీలినీడలను పడేట్టుగా చేస్తున్నాయి.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సలహాదారుడు టికెఏ నాయర్ ని సిబిఐ అధికారులు శుక్రవారం ప్రశ్నించటంతో కాంగ్రెస్ పార్టీలో సర్వత్రా ఆదుర్దా నెలకొంది.  

కోల్ బ్లాక్స్ కేటాయింపులలో వివిధ కంపెనీల వైపు పక్షపాతంతో మొగ్గు చూపించటం విషయంలో సిబిఐ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.  రద్దు చేసే వెసులుబాటుని ఎందుకు ఉపయోగించుకోలేదన్న కోణంలో కూడా సిబిఐప్రశ్నించబోతున్నదని సమాచారం.

ప్రధానమంత్రి కార్యాలయంలో ఎవరి మీదా, ఎటువంటి ఆరోపణలూ లేవని, అధికారులందరూ దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తున్నారని కార్యాలయ సిబ్బంది నిబ్బరంగా చెప్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles