కాసేపు చదవండి, దానికంటే ఎక్కువ సేపు ధ్యానం చెయ్యండి, నిరంతరం భగవంతుని మనసులో నింపుకోండి- పరమహంస యోగానంద.
ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదవటం కానీ, పురాణ కాలక్షేపాలలో సమయాన్ని గడపటం కానీ, భక్తి పాటలు వినటం కానీ, ధ్యానసాధన చెయ్యటం కానీ అన్నిటికీ లక్ష్యం ఒక్కటే- భగవంతుని ధ్యాసలో నిరంతరం ఉండగలగటం.
భాషలో చదవటం కానీ, భజనలు చెయ్యటంకానీ, స్తుతించటం కానీ, పూజాది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటంకానీ చేసినప్పుడు మనసులో వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భాషలో వివిధ రకాల వర్ణనలుంటాయి కాబట్టి. అందుకే దానికి తక్కువ సమయాన్ని కేటాయించమని చెప్పారు యోగానంద.
ధ్యానంలో భాష, ఆలోచనలు, ఉండవు కాబట్టి దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించమని అన్నారు.
అయితే అసలు లక్ష్యం ఎల్లప్పుడూ దైవచింతనలో ఉండటం కాబట్టి దానికో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించనక్కరలేదు. సాధ్యమైనంత వరకూ ఆ ధ్యాసలో ఉండటమే చెయ్యవలసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more
May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more
May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్ ఎంత చక్కని ఆలోచన ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట. తన... Read more
May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more
Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు. కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more