Happy diwali with safety precautions

Happy diwali with safety precautions, Happy and Safe Diwali!, Tips to Enjoy a Safe Diwali, Diwali 2013, Diwali Safety tips

Happy diwali with safety precautions, Happy and Safe Diwali!

దీపావళి పండుగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?

Posted: 11/02/2013 12:49 PM IST
Happy diwali with safety precautions

దీపావళి అంటేనే గుర్తుకు వచ్చేది బాణాసంచా.. అయితే ఈ సారి బాణాసంచా దుకాణాదారులకు పోలీసులు కొన్ని షరతులు విధించారు. నిబంధనలను అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

 

దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో అడుగడుగునా టపాకాయల దుకాణాలు వెలుస్తున్నాయి. బేగంబజార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అంబర్‌పేట, సాగర్‌సొసైటీ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో ఎక్కువగా బాణాసంచా షాపులు ఏర్పాటు చేస్తున్నారు.

 

అయితే గత అనుభువాలను దృష్ట్యా.. ఈ సారి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాణాసంచా దుకాణాదారులకు సూచనలు జారీ చేశారు. జనావాసాల మధ్య షాపులు పెట్టకూడదంటూ కఠిన నిబంధనలు పెట్టారు. దుకాణానికి, దుకాణానికి మధ్య 10మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. నిబంధనలను పాటించని షాపులను తక్షణమే సీజ్‌ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

 

పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా.. స్టాల్స్‌ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. పక్కపక్కనే దుకాణాలు ఏర్పాటు చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైన స్టాల్స్‌ నిర్వాహకులు స్పందించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుదని తెలుగువిశేష్ కోరుతుంది.

 

పండుగల పాటించవలసిన జాగ్రత్తలు :

 

*  దీపావళి నాడు టపాకాయలు ఎంత ప్రాముఖ్యమో, పండుగ ఆనందం కోల్పోరాదంటే అవి కాల్చేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంత ప్రధానమైనవి. ముందుగా జాగ్రత్తలు ఆచరించండి.

 

*  సురక్షిత ప్రదేశం - టపాసులను వేడి తగలని ప్రదేశంలో సురక్షితంగా వుంచండి. వీటిని గట్టి మూత గల బాక్సు లో పిల్లలకు, పెంపుడు జంతువులకు అందని చోట భద్రంగా వుంచాలి.

*  టపాసులను కాల్చేటపుడు వదులు లేని బిగువైన కాటన్ దుస్తులను ధరించండి. అవి తేలికగా అంటుకోకుండా వుంటాయి. పొడవైన లేదా లూజైన దుస్తులు సురక్షితం కాదు.

ఒక్కటి ఒకసారి - ఒక్కొక్క టపాసును ఒకసారిగానే వెలిగించండి. అన్నీ ఒకేసారి వెలిగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం వుంది.

 

*  టపాసులు కాల్చేటపుడు పిల్లలను దూరంగా వుంచండి. పిల్లలు కాల్చేటపుడు పెద్దలలో ఒకరు వారిపక్కన వుండటం మంచిది. చెవులు జాగ్రత్త - టపాసుల ధ్వని 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ కనుక వాటి ధ్వని మీ లోపలి చెవికి హాని కలిగించవచ్చు.

 *  ప్రతి 15 నిమిషాలకు కొంత విశ్రాంతినివ్వండి. చెవులలో కాటన్ దూదులు పెట్టుకుంటే మంచిది. పసిపిల్లలను ధ్వనుల నుండి దూరంగా వుంచండి. అవసరపడితే, ధ్వనిని నియంత్రించే పరికరాలను చెవులకు వాడండి. లేదా ఒక పొడవాటి మఫ్లర్ ను చెవులపైగా తలకు చుట్టండి.

 

ఏం చేయాలి ? ఏం చేయరాదు ? చేయాల్సినవి -

 

*  టపాసులు లైసెన్సు పొందిన అధీకృత డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేయండి.

*  వాటిని గట్టి మూత వున్న బాక్సులో పెట్టండి.

*  వేడికి దూరంగా, పిల్లకు అందుబాటులో లేకుండా ఉంచండి.

*  వాటిని ఒకరే నిర్వహించకుండా, ఇద్దరు లేదా ముగ్గురు కలసి జాగ్రత్తలు తీసుకోండి.

*  టపాసులు వెలిగించేటపుడు పొడవైన కేండిల్ లేదా కాకరపువ్వత్తి వంటివి ఉపయోగించండి. మ్యాచెస్ వాడరాదు. మీరు - వెలిగించే టపాసుకు మధ్య దూరాన్ని పెట్టండి.

*  టపాసులు కాల్చే సమయంలో ఎల్లపుడూ ఒక బకెట్ నీళ్ళు వుంచితే, ఏదైనా జరిగినపుడు వాటిని ఉపయోగించవచ్చు.

 

కాలితే ఏం చేయాలి?

 

*  ఏదైనా కాలటం, కోసుకోవటం జరిగితే, ఆ భాగంపై మంట తగ్గేంత వరకు నీటిని చల్లండి. చేతివేళ్ళు లేదా కాలివేళ్ళు కాలితే, వాటికి బ్యాండేజి కట్టి బాధితుడిని ఆస్పత్రికి తీసుకు వెళ్ళండి.

*  బాధితుడు శ్వాస సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా వెంటనే గమనించండి. అవసరపడితే శ్వాస కోశంలోకి గాలి ఊదండి. కాలిన శరీర భాగానికి బ్యాండేజి వేయండి. కాల్పులపై టవల్ లేదా దుప్పటి కప్పకండి. సరైన వైద్యం కొరకు తక్షణమే బాధితుడిని హాస్పిటల్ కు తరలించండి.

 

చేయకూడనివి:

-)  టపాసులు చేతితో పట్టుకొని కాల్చకండి.

-)  గుంపులున్న చోట, ఇరుకైన ప్రదేశాలలో టపాసులు కాల్చవద్దు.

-)  టపాసులు ఇంటిలో కాల్చవద్దు.

-)  పెద్దవారు పక్కన లేకుండా పిల్లలు ఒకరే టపాసులు కాల్చటానికి అనుమతినివ్వద్దు.

-)  ధ్వని పెద్దగా రావాలని టపాసులను సీసాలలో లేదా డబ్బాలలో పెట్టి కాల్చరాదు.

-)  టపాసులు వెలిగించిన తర్వాత అది కాలిందా లేదా అని వెళ్ళి పరీక్షించవద్దు. కొత్తది కాల్చండి.

 

ఆనందకరమైన, సురక్షితమైన దీపావళి వెలుగులతో ప్రతి కుటుంబం ఆనందలోగిల్లతో వెలిగిపోవాలని తెలుగువిశేష్ మనస్పుర్తిగా కోరుకుంటుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more