Attarintiki daredi movie is not piracy it is conspiracy pawan

Attarintiki Daredi Movie is not Piracy it is Conspiracy Pawan, powerstar pawan kalyan, attarintiki daredi, success meet programme, comments on film piracy and conspiracy, director trivikram, powerstar pavan kalyan, tollywood film industry, attarinitki daredi, success meet, comments on political entry, piracy conspiracy

Attarintiki Daredi Movie is not Piracy it is Conspiracy Pawan, powerstar pawan kalyan, attarintiki daredi, success meet programme, comments on film piracy and conspiracy, director trivikram

సహిస్తా..భరిస్తా.. అవసరమైతే .. తాటతీస్తా: పవర్ హెచ్చరిక

Posted: 10/15/2013 12:13 PM IST
Attarintiki daredi movie is not piracy it is conspiracy pawan

'అత్తారింటికి దారేది' సినిమా థ్యాంక్యూ మీట్ కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగింది. పైరసీని సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలే ప్రోత్సహిస్తున్నారని..అయితే ఇది పైరసీ కాదు కుట్ర అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నాడు. పైరసీ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని..అవసరమైతే వారి తాటతీస్తానని హెచ్చరించాడు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తనకు తెలుసని..త్వరలోనే వారి వివరాలు తెలుపుతానని చెప్పాడు. పైరసీని బయటి జనం చూడలేదేమో గానీ, చిత్రపరిశ్రమలో చాలామంది ప్రముఖులు చూసేశారు. ఇండస్ట్రీని నమ్ముకున్నవాళ్లు, పరిశ్రమే వాళ్ల కుటుంబాలకు ఆధారం అయినవాళ్లు మాత్రం పైరసీని బాగానే ప్రోత్సహించారు.

 

సినిమాను ఐప్యాడ్ లోకి, డెస్క్ టాప్ లోకి డౌన్ లోడ్ చేసుకుని మరీ చూశారు. పోని చూసి వదిలేశారా.. మాకు ఫోన్ చేసి, మీరేం భయపడక్కర్లేదు సినిమా చాలాబాగుందనేసరికి వాళ్లను చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఒక్కళ్లు, ఇద్దరయితే పేర్లు చెప్పచ్చు. కానీ ఎంతమందని చెప్పాలి? అలా వింటూ కూర్చున్నాం. అసలు వీళ్లకి కామన్ సెన్స్ ఉందా? ఎద్దుపుండు కాకికి రుచి.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నాం. కంచే చేను మేసినట్లుగా, ద్రోహం చేసింది బయటివారు కాదు.. లోపలివాళ్లే. ఇది పైరసీ అనిపించట్లేదు.. ఇదో కాన్ స్పిరసీ. నిజంగా పైరసీ చేయాలనుకుంటే 50 రోజులు అలా గుప్పెట్లో పెట్టుకోరు. ఎవరి మాటలు విని వీళ్లు పైరసీ చేశారో, వాళ్లందరినీ నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈ పైరసీని చెయ్యమని ఎవరైతే ప్రోత్సహించారో.. వాళ్లందరినీ రాబోయే సంవత్సరాల్లో పేరుపేరునా గుర్తుపెట్టుకుంటా. వాళ్లు ఏ స్థాయివాళ్లయినా సరే.. అందరికీ ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగేలా చూస్తాను. సహిస్తా.. భరిస్తా..అవసరమైతే తాటతీస్తా'' అని పవన్ అన్నారు.

 

అయితే.. పవన్ ప్రసంగం మొత్తమ్మీద వివాదాస్పద విషయం మరోటి ఉంది. చలన చిత్ర అభివృద్ధి మండలి (ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ -ఎఫ్ డీసీ) సభ్యులలో కొంతమంది కూడా పైరసీ సినిమా చూసేశారని, వాళ్లు ఆ తర్వాత తనకు నేరుగా ఫోన్ చేసి, సినిమా బాగుంది కాబట్టి పైరసీ గురించి ఏమాత్రం భయపడొద్దని చెప్పారన్నారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. చివరకు ఎఫ్ డీసీ సభ్యులు కూడా పైరసీ సినిమాలు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందని అనుకోవాలా? లేదా... పైరసీ సినిమాలను ఎవరెవరు చూశారన్న విషయం కూడా.. అంటే పేర్లు కూడా ఆయనకు తెలిసినా పోలీసులకు చెప్పకుండా ఊరుకున్నందుకు ఆయన నిజాయితీని కూడా అనుమానించాలా అని టాలీవుడ్ వర్గాలు విస్తుపోతున్నాయి. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా పవన్ చాలా నిజాయితీగా ఉంటారని అత్తారింటికి సినిమా దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more