Seemaandhra central ministers meet antony committee

Seemaandhra central ministers meet Antony Committee,antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri, purandeshwari, equal justice to people, chiranjeevi comment, digvijay singh

Seemaandhra central ministers meet Antony Committee,antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri, purandeshwari, equal justice to people, chiranjeevi comment, digvijay singh

రెండో పౌరుడిగా బతికే పరిస్థితి రానీయకండి

Posted: 08/16/2013 10:08 AM IST
Seemaandhra central ministers meet antony committee

సీమాంధ్రలో రోజు రోజుకు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. సీమాంధ్రలో ఉన్న ప్రజలు ప్రవాహంలో రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు పలువురు ఆంటోని కమిటీకి తన గోడును వెల్లబోసుకున్నారు. గురువారం రాత్రి సుమారు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో మంత్రులు కమిటీ వద్ద రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు సీమాంధ్ర ప్రజలను శాంత పరిచే విధంగా ఏదో ఒక ప్రకటన చేయాలని వారు కమిటీకి విన్నమించారు. సీమాంధ్రలో ఎలాంటి నాయకత్వం లేకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, ఏపీ ఎన్జీవోల బంద్ వల్ల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చిందని, మరి కొన్ని రోజులు ఆగితే పరిస్ధితులు అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయని వారితో చెప్పారు. ముఖ్యంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కమిటీకి చెప్పిన కొన్ని విషయాలు కమిటీ ఆసక్తి కరంగా విన్నట్లు సమాచారం. హైదరాబాద్ ను కోల్పోవడం సీమాంధ్రలకు ఏ మాత్రం ఇష్టం లేదని, సీమాంధ్రులకు హైదరాబాద్ తో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని, తాను చెన్నైలో ఉన్నప్పుడు రెండో పౌరుడిగానే బతికానని, ఇప్పడు రాష్ట్రాన్ని విడదీసి హైదరాబాద్ లో రెండో పౌరుడిగా బతికే పరిస్థితి నాకు, సీమాంధ్ర ప్రజలకు రానీయకండి ఆయన కమిటీకి చెప్పినట్లు సమాచారం. మొత్తానికి కేంద్ర మంత్రులు ఆంటోనీ కమిటీకి తమ వాదలను బలంగా వినిపించినట్లు తెలుస్తుంది. ఈ కేంద్ర మంత్రుల సమావేశం అసంపూర్ణంగానే ముగిసింది, తిరిగి 19, 20 తేదీల్లో జరుగుతుంది. ఆ తరువాత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి సమస్యలను ఆలకిస్తారని కేంద్ర మంత్రులు తెలిపారు. అంత వరకు సీమాంధ్రుల శాంతంగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more