కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై ఏర్పాటు పై స్పష్టమైన ప్రకటన చేసినప్పటి నుండి నేటి వరకు సీమాంధ్రలో ఉద్యమ సెగ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సీమాంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. తొమ్మిది రోజుల తరువాత మౌనం వీడిన ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ప్రక్రియ పై ముందకు వెళ్లేముందు అన్ని సమస్యల పై కూలంకషంగా చర్చించాలని అధిష్టానానికి సూచించారు. దీంతో సీమాంధ్రులు విభజనకు సహకరించరని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కాస్తంత ఇరకాలంలో పడింది. తమ మాటకే ఎదురు చెబుతున్న వారికి తగిన విధంగా సమాధానం చెప్పాలని భావించి, త్వరలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా విధించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. తెలంగాణను విభజించి 2014 ఎన్నికల్లో లాభం పొందాలని, ఆహార భద్రత బిల్లుపై ఓటింగ్ తర్వాత తెలంగాణపై చకచకా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో రాజీనామాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని భావిస్తున్నట్లు తెలిస్తుంది. ఇప్పటికే కేంద్రానికి చెందిన ఉన్నతాధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడినట్లు తెలిసింది. కేంద్రాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, అవసరమైతే స్వతంత్ర నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది'' అని వారికి సూచించినట్లు సమాచారం. రాష్ట్రపతి పాలనా విధించి, తెలంగాణ బిల్లును రూపొందించి మళ్లీ అసెంబ్లీని పునరుద్ధరించి అభిప్రాయం కోరుతారని సమాచారం. ముఖ్యమంత్రి ధిక్కరించినా, ఇతర ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసినా... కొత్త ముఖ్యమంత్రిని నియమించేందుకు ప్రయత్నించే ఆలోచనలో ఉన్నట్లు, అది కుదరకపోతే... రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తన లబ్ది కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more