Velagam vani saraswathi

vani saraswathi, velagam vani saraswathi, life of pi movie, oscar, telugu women,

velagam vani saraswathi

velagam-vani-saraswathi.gif

Posted: 02/28/2013 01:54 PM IST
Velagam vani saraswathi

velagam vani saraswathi

ఆస్కార్  పులి వెనుక  ఒక తెలుగమ్మాయి హస్తం?   అద్భుతమైన గాఫిక్స్  వెనుక వందల మంది  యానిమేటర్ల శ్రమ ఉంటుందని మనకు తెలుసు. అయితే  వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి, అద్భుతాలు  ఆవిష్కరించడం వెనుక ఓ తెలుగమ్మాయి ఉంది.  ఉత్తమ విజువల్  ఎఫెక్స్ విభాగంలో  ఆస్కార్  సాధించిన  ‘లైఫ్ ఆఫ్ ఫై’ కి గ్రాఫిక్స్ అందించిన  రిథమ్ అండ్  హ్యూస్  సంస్థ ఆసియా  విభాగానికి  విజయనగరానికి చెందిన వాణి సరస్వతి వెలగం  పాత్ర ఉన్నట్లు సమాచారం.   వాణి సరస్వతి  ‘లైఫ్ ఆఫ్ ఫై’కి కష్టపడిన పని చెబుతుంది.  మేం చూపించిన క్రియేటివిటీకీ ఆస్కార్  గుర్తింపు  లభించినందుకు  నన్ను , మా సిబ్బందని  చాలా మంది  అభినందించారని  వాణి సరస్వతి చెబుతుంది. వాణి బాల్యం జరిగిన  కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంది.  రామాయణ , మహాభారతాల్లోని  హనుమంతుడూ, ఘటోత్కచుడు వంటి  పాత్రల్ని  చూపినప్పుడు  చప్పట్లు  కొట్టడం ,  గాలిలోకి ఎగరడం , ఆకాశంలో  యుద్దం చేయడం  చదవినా,  టీవీలో  చూసినా  ఎంత గొప్పగా  ఉంటాయని, మా నాన్న బ్యాంకు  ఉద్యోగి .  యానిమేషన్ , విజువల్ ఎఫెక్ట్స్  అంటే  ఆయనకెంతో  ఇష్టం.  క్రిష్టుడూ,  హనుమంతుడు  లాంటి పాత్రల్ని  యానిమేషన్   రూపంలో  ప్రపంచానికి చూపాలనుకునే వారు. అదే  ఆలోచనతో ఉద్యోగం మానేసి పలు దేశాల్లో  యానిమేషన్ , విజువల్ ఎప్టెక్ట్స్ కు  సంబంధించి  అధ్యయనం  చేశాను.  నా మీదా, నా తమ్ముడి మీద నాన్న ప్రభావం  ఉంది. మేము యానిమేషన్  రంగాన్నే కెరీర్ గా  ఎంచుకున్నాం. నేను  డిగ్రీ, పీజీ దూరవిద్యలో చేరా.  కాలేజీకి  వెళ్లే వయసులో  చెన్నైలోని  ఒక స్టూడియోలో  తమిళ సినిమాకు  లోగో యానిమేషన్  నేను చేసిన మొదటి  ప్రాజెక్టు.  తరవాత  ముంబయిలోని  ఓ కంపెనీలో చేరా. అక్కడ ఉండగానే  సుమారు ముప్పై బాలీవుడ్  సినిమాలకు  గ్రాఫిక్స్  అందించినట్లు వాణి సరస్వతి చెబుతుంది.   పన్నెండేళ్ల క్రితం ఎన్నో హాలీవుడ్   సినిమాలకు  గ్రాఫిక్స్  అందించిన  ‘రిథమ్  అండ్ హ్యూస్’ లో  పని చేసే అవకాశం  వచ్చింది.  సంస్థ యజమాని  ఇండియాలో  మా కార్యకలాపాలు  ఆరంభించాలనకుంటున్నాం, మీ ఆలోచనలు ఏంటి.. అనడిగారు. చిన్నగా మొదలుపెట్టి, ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ వెళితేనే మంచిదని చెప్పా.  అలాగే చేద్దాం అంటూ  ఆర్నెల్ల  కాంట్రాక్ట్  ఉద్యోగమిచ్చారు.  ముంబయిలో , చిన్న అద్దె  గదిలో   కార్యాలయాన్ని  ఏర్పాటు చేశాం.  నెమ్మదిగా  సినిమాలకు, ఇతర ప్రాజెక్టులకు పనిచేయడం  మొదలుపెట్టాం.  తరవాత  సిబ్బంది పెరిగారు.  హైదరాబాద్ , మలేషియా, తైవాన్లలో  కార్యాలయాలు తెరిచాం.  ఆసియా  వ్యవహారాలన్నీ  నేను చూస్తున్నా.

velagam vani saraswathi

అమెరికాలో  మా ప్రధాన కార్యాలయం ఉంది.   అయితే ఈ రంగంలో ఎన్నో ఆటు పోట్లు ఉన్నాయని  చెబుతుంది.  కంపెనీ కార్యకలాపాలు  ఇండియా ప్రారంభించాక  కూడా మొదట్లో  మాకు పని అప్పజెప్పేవాళ్లు కాదు. హాలీవుడ్ డైరెక్టర్లు తమ కళ్ల ముందు పని జరగాలనుకుంటారు.  ఇక్కడున్న మమ్మల్ని  నమ్మాలని  లేదుగా,  మొదట చిన్న ప్రాజెక్టులను  తీసుకున్నాం, వాటినే బాగా చేశాం. ఐదేళ్లు గడిచేసరికి , పెద్ద ప్రాజెక్టులిచ్చారు.  ‘నార్నియా’కు మేం చేసిన విజువల్  ఎఫెక్ట్స్  చూశాక,  మనవాళ్ల ప్రతిభ  ఏ స్థాయితో అర్థం చేసుకున్నారు. దానిలో  కనిపించే  సింహం  ఇక్కడే  డిజైన్  చేశాం. దానికి ఆస్కార్  నామినేషన్ వచ్చింది.  ఈ రంగంలో  అర నిమిషం  విజువల్స్  కోసం కొన్ని నెలల పాటు  కష్టపడతాం. బాగా రావచ్చు. మాకే నచ్చకపోవచ్చు. మళ్లీ మొదలుపెట్టి  బాగా వచ్చే వరకు ప్రయత్నించాలి. మేం అలాంటి ఓపికతో  చాలా విజయాలు సాధించాం.  కొన్ని సార్లు  అతి తక్కువ సమయంలో క్రియేటివిటీ  చూపించాల్సి  ఉంటుంది.  ఆ ఛాలెంజ్ కీ సిద్దంగా ఉంటాం.  ‘లైప్ ఆఫ్ పై’ సినిమా ఆఖర్లో  దీవిలో  చిన్న చిన్న మీర్  క్యాట్లని  పెద్ద సంఖ్యలో  చూపించే  సన్నివేశం ఉంది.  నిజానికి అది అమెరికాలో  చేయాల్సింది . కానీ చివరకు  మాకు అప్పగించారు. మూడు నెలల పట్టే  పనిని నెలలో పూర్తి చేశాం.  ‘లైఫ్ ఆఫ్ ఫై’ లో 70 శాతం గ్రాఫిక్సే. పులి పాత్ర ఎంతోకీలకం. దాన్ని  గ్రాఫిక్స్ లో  చేయాలి.  దర్శకుడు  ఆంగ్ లీ పులి గురించి  మాకు వివరిస్తూ  పులి మీ దేశానిదే. మీరు పులిలాంటి  వాళ్లు.  నిజమైన పులిలా గ్రాఫిక్స్  ఉండాలి అన్నారు.   చాలా జూలకు వెళ్లి  పులులను పరిశీలించి  గ్రాఫిక్స్   తయారు చేశాం.  మేం చేసిన  పులిని చూశాక, మా పనితీరుకి ఆయన చాలా సంతోషపడ్డారు.   ‘ఇంత మంది  సిబ్బందిని  సమన్వయం  చేసుకంటూ  ప్రాజెక్టు పూర్తి చేయడం  ఎలా సాధ్యం’.  అని కొందరు అడుగుతుంటారు.  ప్రత్యేకంగా  విజయ రహస్యం అంటూ ఏం లేదు.  ఆఫీసులో  చిన్నా, పెద్దా తేడా చూపకుండా   పనిచేస్తాను. ప్రతి రోజు వందశాతం   కష్టపడి  పని  పూర్తి చేయాలనుకుంటా ఏడాదిలో  నెల రోజులు కూడా ఇండియాలో  ఉండను.  అయినా ఇక్కడి  వ్యవహారాలన్నీ  నేనుంటే  ఎలా సాగుతాయో  అలానే సాగుతాయి.  దీనికి నమ్మకమే ప్రధాన కారణం.  ఉద్యోగులకు  పూర్తి స్వేచ్చ ఇస్తాను.  అర్నెల్లకొసారి సరికొత్త సాంకేతికాంశాల  మీద శిక్షణ తరగతులు  ఉంటాయి.  నేను మా ఉద్యోగులకు  చెప్పేదొక్కటే, ‘ఆత్మభిమానంతో, ఆత్మవిశ్వాసంతో పని చేయండి. ఎట్టి  పరిస్థితుల్లోనూ  విలువల్ని  విడిచిపెట్టొద్దు’ అని వాణి సరస్వతి నవ్వుతూ  చెబుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu naidu fire on party leaders
Namrata shirodkar tattooed mahesh babu and children names  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more