ఒకటి కాదు.. రెండు..కాదు..ఏకంగా మూడుసార్లు .. ప్రేమ విఫలమైతే ఎవరైన ఏం చేస్తారు చెప్పండి? మనసులో పుట్టిన గాయాన్ని మాసిపోవాలంటే.. కొంచెం టైమ్ పడుతుంది. అదే ప్రేమను మరొకరికి పంచితే .. పాత సీసాలో ..కొత్త సారా పడుతుంది. మళ్లీ ఆ మత్తు దిగే వరకు గమ్మత్తుగా ఉంటుంది. అలాంటి విషయమే మలబార్ సుందరి నయనతార జీవితంలో జరిగింది. ఒకటి..కాదు..రెండు..కాదు ..ఏకంగా మూడు సార్లు ప్రేమలో పడి విఫలమైన హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు మరో కుర్రహీరోతో ప్రేమగీతాలు పాడుకుంటుంది. అయితే ఆ ప్రేమ గీతం కూడా విషాదగీతం మారే అవకాశాలు ఉన్నాయాని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు నయనతార తన జీవితంలో మరిచిపోలేని ప్రేమగీతాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు గానీ.. రీసెంట్ గా ఆమె ఒక విషాదగీతం పాటుకుంటుందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తుంది. అదీ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు , హీరో ధనుష్ ను చూసిన దగ్గర నుండి నయనలో ఈ విషాదగీతం మొదలైనట్లు తెలుస్తోంది. అంటే హీరో ధనుష్ నిర్మాతగా మారి, ‘ఎదిర్ నీచ్చల్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. అందులో నయన తార చేత ఒక విషాదగీతంలో నయనకు అవకాశం ఇవ్వటం జరిగింది. అయితే అందుకు నయన కాలు కదిపితే కావల్సినంత పారితోషకం ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఈ పాటలో దనుష్, నయన తార ఇద్దరు కలిసి నటిస్తున్నారు. మామూలుగా కథానాయికగా నటించడానికి కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్న నయనతార ఈ పాటకు కాలు కదపడానికి భారీ పారితోషికం తీసుకోవటం జరిగిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నయనతార విషాదగీతంలో నటిస్తున్న సమయంలో హీరో ఆర్య ఆమెకు తోడుగా వచ్చినట్లు కోలీవుడ్ సమాచారం. అయితే ఈ విషాదగీతంలో నయన అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఆసమయంలో హీరో శింబు, ప్రభుదేవాలతో కలిసి సాగిన జీవితం నయనతార కళ్లల్లో కనిపించిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏమైన నయన విషాదగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సినిమా దర్శకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more