HC orders FIR against Shahnawaz Hussain in rape case షానవాజ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. రేప్ కేసు నమోదుకు అదేశం..

Delhi high court orders fir against bjp leader shahnawaz hussain in rape case

Shahnawaz Hussain, rape case, BJP, Delhi High Court, Shahnawaz Hussain rape case, rape case against Shahnawaz Hussain, bihar politics, rape charges on shahnawaz hussain. magisterial court, Supreme court, Delhi woman, bihar politics, Crime

The Delhi High Court has ordered the registration of an FIR against Bharatiya Janata Party (BJP) leader Syed Shahnawaz Hussain on a woman’s complaint of rape at a farmhouse in south Delhi’s Chhatarpur area in April 2018. Justice Asha Menon also questioned the Delhi police for showing “complete reluctance” to even register an FIR and put the investigation machinery into operation.

షానవాజ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. రేప్ కేసు నమోదుకు అదేశం..

Posted: 08/18/2022 04:58 PM IST
Delhi high court orders fir against bjp leader shahnawaz hussain in rape case

బీజేపి సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ పై అత్యాచార కేసు నమోదైంది. ఆయనపై లైంగికదాడి కేసు న‌మోదు చేయాల‌ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఒక మ‌హిళ ఆయనపై అత్యాచార ఆరోప‌ణ‌ల‌ చేయడంతో.. సదరు నేతపై తక్షణం అభియోగాలను మోపుతూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని న్యాయస్థానం స్ప‌ష్టం చేసింది. రేప్ కేసు న‌మోదుకు సంబంధించి కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన ఇదివరకే మెజీస్టీరియ‌ల్ కోర్టు కేసు న‌మోదు చేయాల‌న్న ఆదేశాలు జారీచేసింది.

కాగా, వాటిని సవాల్ చేస్తూ షానవాజ్ హుస్సేన్ హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే అక్కడా ఆయనకు భంగపాటు ఎదురైంది. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని హైకోర్టు కింది కోర్టు అదేశాలను కొనసాగించింది. బీజేపీ సీనియ‌ర్ నేత‌గా అటల్ బిహారి వాజ్ పాయ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కొనసాగిన షానవాజ్.. ప్రస్తుతం బీజేపి కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా కొనసాగుతున్నాడు. కాగా, ఆయ‌న‌పై ఢిల్లీకి చెందిన ఒక మ‌హిళ అత్యాచార అభియోగాలను మోపారు. షాన‌వాజ్‌ త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని, విష‌యం బ‌య‌ట‌పెడితే చంపేస్తాన‌ని బెదిరించాడ‌ని ఆమె ఆరోపించారు.

దాంతో, ఈ ఆరోప‌ణ‌ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని 2018లో స్థానిక కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. అయితే, ఈ ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ షాన‌వాజ్ హుస్సేన్ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ అనంత‌రం ఢిల్లీ హైకోర్టు ఇవాళ కింది కోర్టు అదేశాలను యధాతథంగా కొనసాగించాలని అదేశాలు జారీ చేసింది. 2018లో ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను నిరోధించాల్సిన అవ‌స‌రం త‌మ‌కు క‌నిపించ‌లేద‌ని, నిందితుడు పెట్టుకున్న పిటిష‌న్ కు విచార‌ణార్హ‌త లేద‌ని తాము భావిస్తున్నామ‌ని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆశా మెన‌న్ వ్యాఖ్యానించారు.

కేసు ద‌ర్యాప్తులో ఎఫ్ఐఆర్ న‌మోదు కీల‌క‌మ‌ని, ఎఫ్ఐఆర్ న‌మోదు త‌రువాతే కేసు ద‌ర్యాప్తు వేగవంతం అవుతుంద‌ని జ‌డ్జి అభిప్రాయ‌ప‌డ్డారు. గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు వెలువ‌డ‌గానే, ఆ ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ నిందితుడు షాన‌వాజ్ హుస్సేన్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌పై కేసు న‌మోదైతే, 30 ఏళ్ల త‌న రాజ‌కీయ జీవితం నాశ‌న‌మ‌వుతుంద‌ని కోర్టును అభ్య‌ర్థించారు. త‌న‌పై ఆ మ‌హిళ చేసిన‌వి త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని వివరించారు. త‌న కేసును స‌త్వ‌ర‌మే విచారించాల‌ని కోర్టును కోరారు. దాంతో, ఈ కేసును వ‌చ్చేవారం విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles