హైదరాబాద్ నగరవాసులపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపాడు. గత మూడువారాలుగా నగరంపై కనికరం చూపని వరుణుడు ప్రతి రోజు నగరంపై తన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాడు. తాజాగా సోమవారం అర్థరాత్రి నుంచి మళ్లీ కుండపోత వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం చేసింది. రోడ్లు నీటిమునిగి చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీళ్లు చేరిపోయాయి. నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం ఏకంగా బీభత్సాన్ని తలపించింది. నగరవ్యాప్తంగా కుండపోతగా కురిసిన వర్షం.. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులుగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా చిరుజల్లులు పడుతుంటడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ముషీరాబాద్, కాప్రా, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రయాణగుట్ట, సైదాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ తదితల ప్రాంతాలలో అర్థరాత్రి వేళ వర్షం తీవ్ర ప్రభావాన్ని చాటింది. ఏకధాటిగా కురుసిన వర్షానికి వరద నీరు రహదారులపైకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో అనేకప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కోఠిలో దుకాణాలలోకి నీరు చేరి.. వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది.
ఖైరతాబాద్, అమీర్‌పేట్, నాంపల్లి, అంబర్పేట్, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. కోఠిలో వరద నీటిలో ఓ మోటారు బైక్ కొట్టుకుపోగా, మలక్‌పేట వంతెన దిగువన నడుము లోతులో నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. వర్షాలకు మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు.
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
ఇప్పటికే వరుణుడి అపారకరుణతో తెలంగాణలోని జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తుండగా, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం మాత్రం మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లలు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more