KA Paul meets Union Minister Amit Shah కే.ఏ. పాల్ కేంద్రంమంత్రి అమిత్ షా అగ్రతాంబులం..

Ka paul meets union minister amit shah a day before telangana tour

Praja Shanthi Party, founder president, popular Evangelist, KA Paul, Union Home Minister, Amit Shah, KA Paul Amit Shah, KCR, KTR, YS Jagan, political developments, Telugu states. political developments, Andhra Pradesh, Telangana, Politics

Praja Shanthi Party founder president KA Paul met Union Home Minister Amit Shah and explained to him what is happening in the Telugu states. After the meeting the popular Evangelist interacted with media and said that he told Amit Shah about the recent political developments in both Telugu states

కే.ఏ. పాల్ కేంద్రంమంత్రి అమిత్ షా అగ్రతాంబులం..?

Posted: 05/13/2022 05:27 PM IST
Ka paul meets union minister amit shah a day before telangana tour

తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనంగా మారారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా అది కేవలం ప్రచారానికేనా లేక నిజంగా సీట్లు గెలిచే సత్తా ఉందా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే.. సిరిసిల్ల పర్యటనకు వెళ్తుండగా తన కాన్వాయ్ ను అడ్డుకుని.. టీఆర్ఎస్ కార్యకర్తతో దాడి చేయించిన ఘటనపై ఆయన తెలంగాణ డీజీపీకి గట్టి షాకే ఇచ్చారు. డీజీపీని కలసి తన పిర్యాదును అందజేద్దామన్నుకున్న పాల్ కు మహేందర్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో ఆయనలో ఏదో ఉంది అని రాజకీయ పక్షాలకు అర్థమైంది.

గడిచిన కొద్ద నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన ఆయన.. అధికార టీఆర్ఎస్ అవినీతి మయం అయిందని, సీఎం కేసీఆర్ కుటుంబం 8లక్షల కోట్ల అక్రమాలకు పాల్పడిందని పాల్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, గవర్నర్ తమిళిసైని తరచూ కలుస్తోన్న కేఏ పాల్ పై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. తనపై కేసీఆర్ కుటుంబం దాడి చేయించిందేనంటూ గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసిన పాల్.. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆశ్రయించడం చర్చకు దారి తీసింది.

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్- ఆయన తనయుడు, రాష్ట్రమంత్రి మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో తనపై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఖండించారని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయని, కల్వకుంట్ల కుటుంబం అక్రమాలపై దర్యాప్తు జరిగితే కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దాడి విషయంలో తెలంగాణ డీజీపీ తనకు సమయం ఇవ్వలేదని, కానీ కేంద్ర హోం మంత్రి అడగ్గానే సమయం ఇచ్చారని పాల్ తెలిపారు. ప్రధాని మోదీ మొదలుకొని, కేంద్ర మంత్రులు తనకు ఇచ్చే గౌరవాన్ని అందరూ చూడాలని కే ఏ పాల్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles